ఓటిటిలోకి సెన్సేష‌న‌ల్ ‘కిల్’ మూవీ.. కానీ!

ఓటిటిలోకి సెన్సేష‌న‌ల్ ‘కిల్’ మూవీ.. కానీ!

Published on Jul 23, 2024 1:32 PM IST

బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేక‌ర్ క‌రణ్ జోహ‌ర్ ప్రొడ్యూస్ చేసిన సెన్సేష‌న‌ల్ హిట్ మూవీ ‘కిల్’ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి విజ‌యాన్ని అందుకుంది. ఈ సినిమాకు అంత‌ర్జాతీయంగా గుర్తింపు రావ‌డంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ థియేట‌ర్లకు క్యూ క‌ట్టారు. ఇక ఈ సినిమాలో ల‌క్ష్య‌, తాన్య మ‌ణిక్త‌ల ముఖ్య పాత్ర‌ల్లో న‌టించ‌గా నిఖిల్ నగేష్ భ‌ట్ ఈ చిత్రాన్ని పూర్ఇ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా తెర‌కెక్కించారు.

జూలై 5న ప్ర‌పంచవ్యాప్తంగా థియేట‌ర్ల‌లో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఓటిటిలో స్ట్రీమింగ్ కు వ‌చ్చేసింది. అయితే, ఇది అంద‌రూ వీక్షించ‌డానికి లేక‌పోవ‌డం గ‌మనార్హం. కిల్ చిత్రాన్ని కేవ‌లం యుఎస్ ప్రేక్ష‌కులు వీక్షించేలా అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ కు తీసుకొచ్చింది. అది కూడా వారు 24.99 డాల‌ర్లు చెల్లిస్తే ఈ సినిమాను చూడొచ్చు. దీంతో పాటు యాపిల్ టీవీలో వీడియో ఆన్ డిమాండ్ పై ఈ సినిమాను వీక్షించ‌వ‌చ్చు.

‘కిల్’ మూవీ రిలీజ్ అయిన‌ మూడు వారాల‌కే ఓటిటిలోకి రావ‌డంతో అభిమానులు ఈ సినిమాను చూసేందుకు ఆస‌క్తిని చూపుతున్నారు. ఇక ఇండియాలో ఈ సినిమాను ఓటిటిలో వీక్షించాలంటే సెప్టెంబ‌ర్ వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే. ఈ సినిమాలో అద్రిజ సిన్హా, రాఘ‌వ్ జుయ‌ల్, ఆశిష్ విద్యార్థి త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్రల్లో న‌టించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు