Kill: ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “కిల్” తెలుగు వెర్షన్

రీసెంట్ గా బాలీవుడ్ సినిమా దగ్గర సూపర్ హిట్ అయ్యిన చిత్రాల్లో ఏ రేటెడ్ గా వచ్చి మంచి టాక్ ని అందుకున్న చిత్రం “కిల్” కూడా ఒకటి. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో లక్ష్య హీరోగా తన్యా మనిక్థలా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు నిఖిల్ నగేష్ భట్ దర్శకత్వం వహించగా ఇది బాలీవుడ్ సహా మిగతా భాషల్లో కూడా మంచి అటెన్షన్ ని ఈ చిత్రం అందుకుంది. దీనితో ఈ చిత్రం ఓటిటి రిలీజ్ కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురు చూసారు.

అయితే ఈ సినిమాని రీసెంట్ గానే ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ముందుగా ఒక్క హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ కి తీసుకొచ్చారు. అయితే ఇపుడు ఈ సినిమా తెలుగు సహా తమిళ, మళయాళ భాషల్లో కూడా అందుబాటులోకి వచ్చేసింది. మరి ఇదే డిస్నీ + హాట్ స్టార్ లోనే నేటి నుంచి కిల్ చిత్రం అందుబాటులోకి వచ్చేసింది. ఇక ఈ చిత్రాన్ని తెలుగులో చూడాలి అనుకునేవారు హాట్ స్టార్ లో స్ట్రీమ్ చేయవచ్చు.

Exit mobile version