Bigg Boss 8: “బిగ్ బాస్ 8″లో చరణ్ సాంగ్ కి అదరగొట్టిన నాగ్


గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం “గేమ్ ఛేంజర్” పై ఇప్పుడు మరిన్ని అంచనాలు పెరుగుతూ వెళ్తున్న సంగతి తెలిసిందే. మరి భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రాన్ని మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కించగా మెగా ఫ్యాన్స్ అంతా మంచి ఎగ్జైటింగ్ గా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ క్లిక్ అయ్యాయి. అలాగే సినిమా లేటెస్ట్ సాంగ్ రా మచ్చా మచ్చా కూడా సూపర్ హిట్ అయ్యింది.

మరి సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న ఈ సాంగ్ కి అక్కినేని నాగార్జున స్టెప్పేసి అదరగొట్టారు. ఇప్పుడు నాగ్ క్రేజీ రియాలిటీ షో బిగ్ బాస్ 8 కి హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఇందులో ఈ అక్టోబర్ 6 స్పెషల్ ఎపిసోడ్ కి నాగ్ ఎంట్రీ ఈ మాస్ సాంగ్ తోనే జరిగింది. దీనితో ఈ విజువల్స్ ని ఫ్యాన్స్ వైరల్ చేసుకుంటున్నారు. మొత్తానికి అయితే రావు మచ్చా మచ్చా మేనియా ఇలా కొనసాగుతుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా నెక్స్ట్ సాంగ్ నవంబర్ లో రిలీజ్ రానుంది అలాగే సినిమాని ఈ క్రిస్మస్ కానుకగా ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version