ట్రెండింగ్ లో దూసుకుపోతున్న ‘కింగ్ ఆఫ్ కోతా’ టీజర్

ట్రెండింగ్ లో దూసుకుపోతున్న ‘కింగ్ ఆఫ్ కోతా’ టీజర్

Published on Jun 29, 2023 10:30 PM IST

మలయాళ యంగ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్ ఆఫ్ కోతా. ఈ సినిమాకి అభిలాష్ జోషి దర్శకుడు. పాన్ ఇండియా రేంజ్ లో గ్రాండ్ లెవెల్లో వేఫేరర్ ఫిల్మ్స్, జీ స్టూడియోస్ సంస్థల పై నిర్మితం అవుతోన్న మూవీ ఇది. కాగా నిన్న ఈ మూవీ యొక్క టీజర్ విడుదలైంది. తెలుగు టీజర్‌ను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు రిలీజ్ చేశారు. కింగ్ ఆఫ్ కోతా టీజర్ చాలా పవర్‌ఫుల్‍గా, ఇంటెన్స్‌గా ఉంది. కోతా అనే ఊరిలోని ప్రజలను విలన్ల బారి నుంచి రక్షించే గ్యాంగ్‍ స్టర్‌గా దుల్కర్ నటిస్తున్నట్టు టీజర్ ద్వారా తెలుస్తోంది. ఇక టీజర్ లో దుల్కర్ యాక్టింగ్ అదిరిపోయింది.

ఒకటిన్నర నిమిషాలు ఉన్న టీజర్ గ్యాంగ్‍స్టర్లు, యాక్షన్ సీన్లు, పోలీసులతో చాలా ఇంట్రెస్టింగ్‍గా ఉంది. కాగా ప్రస్తుతం ఈ టీజర్ 9 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ లో మంచి క్రేజ్ తో ట్రెండింగ్ లో దూసుకెళుతోంది. అయితే టీజర్ తో ఒక్కసారిగా అందరిలో మూవీ పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. కాగా కింగ్ ఆఫ్ కోతా లో దుల్కర్ సల్మాన్ కి జోడీగా ఐశ్వర్య లక్ష్మి నటిస్తుండగా డాన్సింగ్ రోజ్ షబీర్, ప్రసన్న, నైలా ఉష, చెంబన్ వినోద్, గోకుల్ సురేశ్ ఇతర పాత్రలు చేస్తున్నారు. త్వరలో ఈ మూవీ నుండి ఒక్కొక్కటిగా మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు