పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా “కింగ్ ఆఫ్ కోతా” ట్రైలర్

పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా “కింగ్ ఆఫ్ కోతా” ట్రైలర్

Published on Aug 10, 2023 12:23 PM IST

దుల్కర్ సల్మాన్ మరియు ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రల్లో నటించిన కోలీవుడ్ చిత్రం కింగ్ ఆఫ్ కోతా ఈ ఓనం సందర్భంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. దీనికి ముందు, అభిలాష్ జోషి దర్శకత్వం వహించిన దాని థియేట్రికల్ ట్రైలర్‌ను ఈ రోజు ఆవిష్కరించారు. ట్రైలర్ పవర్ ఫుల్ గా ఉంది. అనేక యాక్షన్ సన్నివేశాలను కలిగి ఉంది.
సినిమాపై ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేకెత్తించేలా మేకర్స్ ట్రైలర్‌ను కట్ చేశారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరియు ఖచ్చితమైన యాక్షన్ కట్‌ల కలయిక ట్రైలర్ పై అంచనాలను పెంచేసింది.

దుల్కర్ సల్మాన్ యొక్క ఫ్యాన్స్ కి ఇది పెద్ద ట్రీట్ అని చెప్పాలి. దుల్కర్ సల్మాన్ మరియు ఐశ్వర్య లక్ష్మితో పాటు, కింగ్ ఆఫ్ కోతాలో చెంబన్ వినోద్, షబీర్ (డ్యాన్స్ రోజ్), నైలా ఉష, షమ్మీ తిలకన్, శాంతి కృష్ణ, ప్రసన్న, గోకుల్ సురేష్, అనిఖా సురేంద్రన్, శరణ్ శక్తి మరియు అనేక ఇతర ప్రముఖ నటీనటులు కూడా ముఖ్యమైన పాత్రల్లో నటించారు. జీ స్టూడియోస్ సహకారంతో, వేఫేరర్ ఫిల్మ్స్ ఈ సినిమా ను నిర్మింస్తోంది. దీనికి షాన్ రెహమాన్ మరియు జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు