ప్రస్తుతం యావత్ భారతదేశం చర్చించుకుంటున్న సినిమా ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా ‘కల్కి 2898 AD’ మాత్రమే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఈ ప్రెస్టీజియస్ సైన్స్ ఫిక్షన్ మూవీ గతవారం రిలీజ్ అయ్యి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాతో తెలుగు సినిమా సత్తా మరోసారి యావత్ ప్రపంచానికి తెలిసిందని అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు.
ఇక ఈ సినిమాకు పనిచేసిన యాక్షన్ డైరెక్టర్ కింగ్ సోలోమాన్ తాజాగా తన అనుభవాన్ని ఓ వీడియో రూపంలో పంచుకున్నారు. కల్కి సినిమా కోసం తనతో పాటు తన టీమ్ మొత్తం ఎంతో కష్టపడి పనిచేశామని ఆయన చెప్పుకొచ్చారు. నాగ్ అశ్విన్ ఆలోచనలు నెక్ట్స్ లెవెల్ లో ఉన్నాయి కాబట్టి.. ఆయన యాక్షన్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాలేదు కాబట్టి నేడు కల్కి ఓ విజువల్ వండర్ గా నిలిచిందని సోలోమాన్ అన్నారు. అటు సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ ఈ వయసులో కూడా చేసిన యాక్షన్ సీన్స్ చూసి తానే షాక్ అయ్యానంటూ సోలోమాన్ చెప్పుకొచ్చారు.
20 అడుగుల ఎత్తు నుండి అమితాబ్ జంప్ చేయడం నిజంగా విశేషమని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఇక ఈ సినిమాలో మార్షల్ ఆర్ట్స్ సాయంతో యాక్షన్ సీన్స్ ను సరికొత్తగా కంపోజ్ చేసినట్లుగా కింగ్ సోలోమాన్ తెలిపారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి