అతని కోసం ‘కింగ్‌డమ్’ ఎదురుచూస్తోంది!

అతని కోసం ‘కింగ్‌డమ్’ ఎదురుచూస్తోంది!

Published on Apr 9, 2025 4:48 PM IST

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రాల్లో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కింగ్డమ్’ కూడా ఒకటి. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్, టీజర్ రిలీజ్ కాగా వాటికి ట్రెమండస్ రెస్పాన్స్ దక్కింది. ఇక ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమాను వేసవి కానుకగా మే 30న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఇక ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఇప్పటికే శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో అనిరుధ్ ఇంకా జాయిన్ కాలేదని తెలుస్తోంది.

ఇప్పటికే పలు క్రేజీ సినిమాలను ఓకే చేసిన అనిరుధ్ ఆ చిత్రాలతో బిజీగా ఉన్నాడట. దీంతో త్వరలోనే ‘కింగ్డమ్’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌లో అతను జాయిన్ అవుతాడని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక ఈ సినిమాకు అనిరుధ్ ఇచ్చే సంగీతం ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లనుంది. భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు