డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమైన “కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్”

డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమైన “కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్”

Published on Jul 24, 2024 2:00 AM IST

డైరెక్టర్ వెస్ బాల్ దర్శకత్వంలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్ కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషంగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ కి రెడీ అయిపోయింది. ఈ చిత్రం యొక్క డిజిటల్ హక్కులని ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం యొక్క డిజిటల్ అరంగేట్రం పై ఒక క్లారిటీ వచ్చింది.

ఆగస్ట్ 2, 2024 నుండి ఈ చిత్రం ఇంగ్లీష్ భాషతో పాటుగా, హిందీ, తెలుగు మరియు తమిళంలో ప్రసారం కానుంది. ఇదే విషయాన్ని సరికొత్త పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. బాక్సాఫీస్ వద్ద సూపర్ రెస్పాన్స్ ను కొల్లగొట్టిన ఈ క్రేజీ మూవీ, డిజిటల్ ప్రీమియర్ గా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి. థియేటర్ల లో మిస్ అయిన వారికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు