కిరణ్ అబ్బవరం “దిల్ రూబ” టీజర్ డేట్ ఖరారు.!

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం రీసెంట్ గానే తన కెరీర్ లోనే సాలిడ్ హిట్ “క” తో అందుకున్న సంగతి తెలిసిందే. కొంచెం గ్యాప్ తీసుకొని చేసిన ఈ చిత్రం మొన్న దీపావళి కానుకగా వచ్చి అదరగొట్టింది. తన కెరీర్ లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అయితే ఈ చిత్రం తర్వాత తన నుంచి రాబోతున్న లేటెస్ట్ చిత్రమే “దిల్ రూబ”.

దర్శకుడు విశ్వ కరుణ తెరకెక్కించిన ఈ చిత్రం నుంచి మేకర్స్ టీజర్ అప్డేట్ ఇచ్చేసారు. దీనితో ఈ టీజర్ కట్ ని మేకర్స్ జనవరి 3న రిలీజ్ కి తీసుకొస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. అలాగే ఈ చిత్రాన్ని ఈ రానున్న ఫిబ్రవరిలో రిలీజ్ కి తీసుకొస్తున్నట్టుగా కూడా కన్ఫర్మ్ చేశారు. మరి ఈ డేట్ ఇంకా కన్ఫర్మ్ కావాల్సి ఉంది. ఇక ఈ చిత్రంకి “క” సినిమా సంగీత దర్శకుడే సామ్ సి ఎస్ వహిస్తుండగా యూడ్ లీ ఫిలిమ్స్ వారు నిర్మాణం వహిస్తుండగా ఈ సరిగమ వారి సమర్పణలో ఈ చిత్రం రాబోతుంది.

Exit mobile version