“క” సెన్సార్ పూర్తి.. ‘బిగ్ బాస్’ లో టైటిల్ సీక్రెట్ పై యంగ్ హీరో


ఈ దీపావళి కానుకగా మన తెలుగు సినిమా నుంచి రాబోతున్న లేటెస్ట్ చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా దర్శకులు సుజీత్ మరియు సందీప్ లు తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చిత్రం “క” కూడా ఒకటి. మరి ఈ సినిమా ట్రైలర్ తో మంచి అటెన్షన్ ని అయితే తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

అలాగే ఈ సినిమా విషయంలో హీరో సహా చిత్ర యూనిట్ అంతా సాలిడ్ కాన్ఫిడెన్స్ గా కూడా ఉన్నారు. అయితే ఈ సినిమా లేటెస్ట్ గా సెన్సార్ ని పూర్తి చేసుకున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. మరి ఈ సినిమాకి సెన్సార్ యూనిట్ యూ/ఏ సర్టిఫికెట్ ని అందించారు. దీనితో అన్ని పనులు పూర్తి చేసుకొని క విడుదలకి సిద్ధం అయ్యిపోయింది అని చెప్పాలి.

అలాగే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ని కూడా జోరుగా చేస్తుండగా మన తెలుగు పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ లోకి కూడా వెళ్లారు. అయితే ఇందులో కిరణ్ అబ్బవరం సినిమా టైటిల్ “క” అంటే అర్ధం ఏంటి అనేది సినిమా క్లైమాక్స్ లోనే తెలుస్తుంది అని సీక్రెట్ రివీల్ చేసాడు. దీనితో అసలు ఒక్క అక్షరం వెనుక ఉన్న మిస్టరీ తెలియాలి అంటే క సినిమా చూడాల్సిందే అని చెప్పాలి.

Exit mobile version