డబ్బింగ్ పనులు పూర్తి చేసుకున్న ‘క’

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘క’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని కిరణ్ అబ్బవరం తన సొంత బ్యానర్‌లో ప్రొడ్యూస్ చేస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని సుజిత్ – సందీప్ ద్వయం డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుగుతున్నాయి.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులు పూర్తయినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్‌ను కూడా వేగవంతం చేయాలని చిత్ర యూనిట్ ప్రయత్నిస్తుంది. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరికొత్త లుక్‌తో కనిపిస్తుండగా, సస్పెన్స్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో కిరణ్ అబ్బవరం సాలిడ్ హిట్ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో తన్వీ రామ్, నయన్ సారిక, అచ్యుత్ కుమార్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సామ్ సిఎస్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్ర ట్రైలర్‌ను త్వరలోనే రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 31న గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.

Exit mobile version