టాలీవుడ్‌లో ప్రస్తుతం తెరకెక్కిన చిత్రాల్లో ‘క’ మూవీపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాను దర్శకులు సుజిత్-సందీప్ తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్, సాంగ్స్‌కి ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ లభించింది. ఇక నేడు సాయంత్రం ఈ సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించడంతో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు.
కానీ, కొన్ని కారణాల వల్ల ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ సమయాన్ని సాయంత్రం 5.01 గంటల నుండి రాత్రి 7 గంటలకు మార్చారు. అయితే, అప్పటికి కూడా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ కాలేదు. దీంతో అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నేడు ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ ఉండదని.. సాంకేతిక సమస్యల వల్ల ఈ చిత్ర ట్రైలర్‌ను రేపు(అక్టోబర్ 25) ఉదయం 10.05 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
కిరణ్ అబ్బవరం ఎంతో ప్రతిష్టాత్మకంగా నటిస్తూ, ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఎలాంటి బ్లాస్ట్ ఇవ్వబోతుందా.. సినిమాపై ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తుందా అని అభిమానులు చూస్తున్నారు. ఈ సినిమాకు సామ్ సిఎస్ సంగీతం అందిస్తుండగా, దీపావళి కానుకగా అక్టోబర్ 31న ఈ సినిమాను గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు.