షూటింగ్ ముగించుకున్న కిరణ్ అబ్బవరం ‘క’

షూటింగ్ ముగించుకున్న కిరణ్ అబ్బవరం ‘క’

Published on Sep 24, 2024 9:02 PM IST

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘క’ ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను సరికొత్త కథతో తెరకెక్కిస్తున్నారు మేకర్స్. సుజిత్, సందీప్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండగా కిరణ్ అబ్బవరం ఈ సినిమాలో సరికొత్త లుక్‌తో కనిపిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ లభించింది.

ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఈ చిత్ర షూటింగ్ ముగిసినట్లుగా మేకర్స్ వెల్లడించారు. సెట్స్‌లో చిత్ర యూనిట్ మొత్తం కలిసి ఓ ఫోటో దిగి ఈ విషయాన్ని వెల్లడించారు. షూటింగ్ పార్ట్ ముగించుకున్న ‘క’, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ అయ్యిందని వారు తెలిపారు.

ఈ సినిమాలో నయన్ సారిక హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నాడు. క ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కిరణ్ అబ్బవరం ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు