నెక్స్ట్ మూవీపై కిరణ్ అబ్బవరం సాలిడ్ అప్డేట్

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం రీసెంట్‌గా ‘క’ మూవీతో బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా ‘క’ చిత్రం నిలవడంతో కిరణ్ అబ్బవరం తన సక్సెస్‌ను పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే, ఇప్పుడు తన నెక్స్ట్ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చేందుకు కిరణ్ అబ్బవరం రెడీ అయ్యాడు.

తాజాగా తన నెక్స్ట్ మూవీకి సంబంధించి ఓ ప్రీ-లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశాడు. కిరణ్ అబ్బవరం కెరీర్‌లో 10వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్‌ను డిసెంబర్ 19న అనౌన్స్ చేయబోతున్నట్లు ఓ ప్రీ-లుక్ పోస్టర్ ద్వారా మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాను యూడ్లీ డైరెక్ట్ చేస్తుండగా అందాల భామ రుక్సర్ ఢిల్లోన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ సినిమాను శివమ్ సెల్యూలాయిడ్స్, సరిగమప బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి కథతో రానుంది.. ఈ సినిమాకు ఎలాంటి టైటిల్‌ను ఫిక్స్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Exit mobile version