ఒక్కటైన కిరణ్ అబ్బవరం – రహస్య గోరక్

ఒక్కటైన కిరణ్ అబ్బవరం – రహస్య గోరక్

Published on Aug 22, 2024 11:00 PM IST

తెలుగు సినీ పరిశ్రమలో రాజావారు రాణివారు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఈ చిత్రంలో రహస్య గోరక్ హీరోయిన్ గా నటించిన సంగతి అందరికీ తెలిసిందే. స్నేహితులుగా ఉన్న వీరు, ప్రేమికులుగా మారారు. ఇటీవల వీరిద్దరికీ నిశ్చితార్థం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే.

వీరిద్దరి బంధు మిత్రుల సమక్షంలో ఒక్కటయ్యారు. కిరణ్ అబ్బవరం మరియు రహస్య గోరక్ లు వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీరిద్దరికీ సినీ అభిమానులు, ప్రముఖులు బెస్ట్ విషెస్ తెలిపుతున్నారు. కిరణ్ అబ్బవరం తదుపరి పాన్ ఇండియా మూవీ “క” చిత్రంలో కనిపించనున్నాడు. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు