థ్రిల్లింగ్ గా “క” ట్రైలర్.. కిరణ్ అబ్బవరం కంబ్యాక్ కొట్టేలా..


ఈ దీపావళి కానుకగా రాబోతున్న లేటెస్ట్ చిత్రాల్లో టాలీవుడ్ యంగ్ షైనింగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా దర్శకులు సుజిత్ అలాగే సందీప్ లు తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ సినిమా “క” కూడా ఒకటి. కిరణ్ అబ్బవరం కొంచెం గ్యాప్ తీసుకొని ఈ పాన్ ఇండియా సినిమా అనౌన్స్ చేయడంతోనే మంచి బజ్ ని తెచ్చుకున్నాడు.

అలా టీజర్ తోనే ఆసక్తి రేపగా ఇప్పుడు సినిమా నుంచి సాలిడ్ ట్రైలర్ ని అయితే మేకర్స్ రిలీజ్ చేశారు. మరి ఈ ట్రైలర్ మాత్రం మంచి థ్రిల్లింగ్ గా కనిపిస్తుంది. మధ్యాహ్నం మూడు గంటలకే చీకటయ్యిపోయే ఓ చిన్న గ్రామంలో జరిగే అనుమానాస్పద పనులు అక్కడ పోస్ట్ మ్యాన్ గా కనిపించే పాత్రలో కిరణ్ కనిపిస్తున్నాడు.

అలాగే తన రోల్ అతడు పర్ఫెక్ట్ గా సెట్ అవ్వగా తనపై యాక్షన్ బ్లాక్ లు, ఇంటెన్స్ ఎమోషన్స్ ని చూపించాడు. అలాగే సినిమాలో ఓ మిస్టీరియస్ మ్యాన్ కూడా కనిపిస్తున్నాడు. వీటితో ట్రైలర్ మాత్రం సినిమాపై మరిన్ని అంచనాలు పెంచింది అని చెప్పాలి. అలాగే సినిమా ట్రైలర్ సామ్ సి ఎస్ స్కోర్ ఇంప్రెసివ్ గా ఉందని చెప్పాలి. మరి 31న వచ్చే సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version