కంటెంట్ బేస్డ్ ఫిలిమ్స్ తో దూసుకొస్తున్న నూతన నిర్మాత కిరణ్ కె తలశిల

కంటెంట్ బేస్డ్ ఫిలిమ్స్ తో దూసుకొస్తున్న నూతన నిర్మాత కిరణ్ కె తలశిల

Published on Mar 2, 2021 1:50 PM IST

2018లో చిన్న బడ్జెట్ లో డీసెంట్ హిట్ అందుకున్న సినిమా ‘ భలే మంచి చౌక బేరమ్’. ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్ గా చేసిన కిరణ్ కె తలశిల ఇప్పుడు టాలీవుడ్ లో కాన్సెప్ట్ బేస్డ్ ఫిలిమ్స్ తో ప్రేక్షకుల్ని థ్రిల్ చేయడానికి సిద్ధమయ్యారు. ఇటీవలే ట్రైలర్ తో అందరినీ ఆకట్టుకున్న సినిమా ‘క్రేజీ అంకుల్స్’. శ్రీముఖి ప్రధాన పాత్రలో, రాజా రవీంద్ర, సింగర్ మనో, పోసాని కృష్ణమురళి నటించిన ఈ సినిమా త్వరలో విడుదలకి సిద్ధమవుతోంది.

నిర్మాత కిరణ్ కె తలశిల కేవలం తెలుగులోనే కాకుండా తెలుగు – తమిళ భాషల్లో రూపొందిన ‘సెవెన్’ అనే క్రైమ్ థ్రిల్లర్ మరియు ‘నాన్న ప్రకార’ లాంటి కన్నడ సినిమాలతో అందరి దృష్టిని ఆకర్షించిన నిర్మాత. తెలుగు, కన్నడకి మాత్రమే కాకుండా తమిళ స్టార్ హీరో జీవ – షాలిని పాండే జంటగా నటించిన ‘గొరిల్లా’ సినిమాకి కూడా అసోసియేట్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించి తనకి సరికొత్త సినిమాలపై ఉన్న ఇష్టాన్ని ప్రూవ్ చేసుకున్నారు.

గత రెండు దశాబ్దాలుగా యుఎస్ లో బ్యాంకింగ్ ఇండస్ట్రీతో అసోసియేట్ అయ్యున్న కిరణ్ తలశిల రానున్న రోజుల్లో వరుసగా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో వరుసగా సరికొత్త జానర్స్ లో సినిమాలను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. క్రేజీ అంకుల్స్ తర్వాత నిర్మాత కిరణ్ కె తలశిల నుంచి ‘గోదారి కథలు’, ‘గోల్డ్ మాన్’ మరియు ‘నలుగురితో నారాయణ’ అనే సినిమాలను లైన్ లో ఉంచారు. ప్రస్తుతం వీటి చిత్రీకరణ శరవేగంగా జరుగుతుండడమే కాకుండా, ప్రతి సినిమా కంటెంట్ పరంగా ప్రతి ఒక్కరూ గొప్పగా మాట్లాడుకునే సినిమాలు అవుతాయని కిరణ్ సన్నిహితులు చెబుతున్నారు.

నిర్మాత కిరణ్ తెలుగు, తమిళ, కన్నడ భాషల్ని కవర్ చేయడమే కాకుండా త్వరలోనే బాలీవుడ్ లోనూ తన మార్క్ ని చూపించడం కోసం ‘ఏ కాష్ కె హమ్’ అనే సినిమాని నిర్మిస్తున్నారు. అందులో హీరోగా బాలీవుడ్ లో ఫేమస్ అయిన, విలక్షణ నటుడు నాజీరుద్దీన్ షా కుమారుడిని హీరోగా పరిచయం చేస్తున్నాడు. ‘నిర్మాతగా ఒక్క తెలుగులోనే కాదు, అన్ని భాషల్లోనూ కంటెంట్ డ్రివెన్ సినిమాలు చేసి మెప్పించడమే ల్లక్ష్యం’ అని కిరణ్ కె తలశిల అంటున్నారు.

ఇప్పటికే డిజిటల్ వరల్డ్ లో కిరణ్ కిడ్స్ కి, ఫ్యామిలీస్ మరియు యువతకి ఉపయోగపడే ఎంతో సూపర్బ్ కంటెంట్ ని నిర్మిస్తున్నారు. ఆ డిజిటల్ కంటెంట్ కోసం ఒకసారి విజిట్ myeastface.com చేయండి. కచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు