బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తో ఆయన భార్య కిరణ్ రావ్ విడాకుల అంశం అప్పట్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే, ఆ తర్వాత కూడా పలు వేడుకల్లో ఈ మాజీ భార్యాభర్తలిద్దరూ కలిసి కనిపించారు. కానీ, ఈ మధ్య ఓ వేడుకలో మాత్రం ఇద్దరు వేరువేరుగా వచ్చారు. దీంతో, వీరిపై మళ్లీ రూమర్స్ వినిపించాయి. ఈ నేపథ్యంలో విడాకుల తర్వాత తాను చాలా సంతోషంగా ఉన్నట్లు అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావ్ చెప్పడంతో ఇప్పుడు ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.
కిరణ్ రావ్ ఏం మాట్లాడారు అంటే..’అమీర్ నా జీవితంలోకి రాక ముందు నేను చాలా ఏళ్లు ఒంటరిగానే ఉన్నాను. ఆ ఒంటరితనాన్ని ఎంజాయ్ చేశాను. ఇప్పుడు నాకు ఆజాద్ (కుమారుడు) తోడుగా ఉన్నాడు. నేను ఒంటరి కాదు. ఇప్పటికీ ఇరు కుటుంబాలు నాకు అండగా ఉండటంతో ఎలాంటి భయం లేదు. చెప్పాలంటే ఇది సంతోషకరమైన విడాకులు’ అని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కిరణ్ రావ్ తెలిపారు.