సమీక్ష : ‘కిస్ కిస్ కిస్సిక్’ – కాన్సెప్ట్ బాగున్నా కథనం బాగోదు

Kiss Kiss Kissik

విడుదల తేదీ : మార్చి 21, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : సుశాంత్, జాన్య జోషి ,విధి, మురళీ శర్మ, విజయ్ రాజ్, అలీ అస్గర్ ,సునీల్ పాల్ ,అజయ్ జాదవ్ తదితరులు.
దర్శకుడు : శివ్ హరే
నిర్మాతలు: విధి ఆచార్య
సంగీతం : డా. నిట్జ్
సినిమాటోగ్రఫీ : అజయ్ పాండే
ఎడిటర్ : మనోజ్ మగర్
సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

శివ్ హరే దర్శకత్వం వహించిన చిత్రం ‘కిస్ కిస్ కిస్సిక్’. ఈ సినిమాలో సుశాంత్‌ హీరోగా జాన్య జోషి, విధి హీరోయిన్స్ గా నటించారు. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

పింటూ (సుశాంత్) తన చదువు కోసం తన మామయ్య (గణేష్ ఆచార్య) దగ్గరకు వస్తాడు. అక్కడ ఎదురుగా ఉన్న ఇంటిలోని పమ్మీ (విధి) ని చూసి ప్రేమలో పడతాడు. అయితే, పింటూ ఆమెను కిస్ చేసిన తర్వాత ఆమెకు వెంటనే పెళ్లి అయిపోతుంది. పైగా పింటూ ఏ అమ్మాయిని కిస్ చేసినా ఆమెకు వెంటనే పెళ్లి అయిపోతూ ఉంటుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య పింటూ అతని మామయ్య ‘కన్ ఫార్మ్ పెళ్లి’ అనే కంపెనీని స్టార్ట్ చేసి బిజినెస్ చేస్తారు. అలా అమ్మాయిల పెళ్లిళ్లు చేసి డబ్బు సంపాదిస్తారు. ఈ క్రమంలో పింటూ జీవితంలోకి ప్రేరణ (జాన్య జోషి) వస్తోంది. మరి ప్రేరణ కోసం పింటూ ఏం చేశాడు ?, ఆమెకు ముద్దు కూడా పెట్టలేని పరిస్థితి పింటూది. అసలు పింటూకి ఈ శాపం ఎలా వచ్చింది ?, చివరకు పింటూ – ప్రేరణ ఒక్కటి అయ్యారా ? లేదా ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

కథలోని కాన్సెప్ట్ బాగానే ఉంది. అలాగే, కథ తాలూకు సెటప్ అండ్ హీరోకి ఉన్న శాపం, ఆ శాపం కారణంగా వచ్చే డ్రామాలోని కామెడీ సీన్స్, లవ్ సీన్స్ మరియు పెళ్లి సీక్వెన్స్ బాగున్నాయి. అలాగే సినిమాలో వినోదంతో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో హీరోగా నటించిన సుశాంత్ తన నటనతో, తన బాడీ లాంగ్వేజ్ తో బాగా నటించాడు. సినిమాలో మరో కీలకమైన పాత్రలో నటించిన గణేష్ ఆచార్య కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. గణేష్ ఆచార్య పాత్ర పై వచ్చే కామెడీ సీన్స్ కూడా ఆకట్టుకున్నాయి.

హీరోయిన్ జాన్య జోషి తన గ్లామర్ తో అలరించింది. హీరోతో సాగే ఆమె లవ్ అండ్ బోల్డ్ సీన్స్ కూడా బాగున్నాయి. మరో హీరోయిన్ గా విధి కూడా బాగా నటించింది. మురళీ శర్మ పాత్ర బాగుంది. విలన్ గా విజయ్ రాజ్ చాలా బాగా నటించాడు. ఆయన మేనరిజమ్స్ బాగున్నాయి. ప్రధాన పాత్రల మధ్య వచ్చే పంచ్ లు అండ్ కామెడీ టైమింగ్ కూడా అలరిస్తోంది. ఇక అలీ అస్గర్, సునీల్ పాల్, అజయ్ జాదవ్ లతో పాటు మిగిలిన కీలక పాత్రల్లో నటించిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మొత్తానికి ఈ సినిమాలో కొన్ని కామెడీ అంశాలు మెప్పించాయి.

మైనస్ పాయింట్స్ :

ఈ ‘కిస్ కిస్ కిస్సిక్’ సినిమా మెయిన్ పాయింట్ లో మ్యాటర్ ఉన్నప్పటికీ.. ఆ పాయింట్ కి తగ్గట్టు స్క్రీన్ ప్లే రాసుకోవడంలో దర్శకుడు శివ్ హరే కొన్ని చోట్ల తడబడ్డాడు. అసలు ఇలాంటి కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు సినిమాని ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ ప్లే ఫుల్ ఫన్ తో సాగితే బాగుండేది. కానీ, సెకండ్ హాఫ్ లో ఉన్న ఇంట్రెస్టింగ్ ఫన్ ఎలిమెంట్స్.. ఫస్ట్ హాఫ్ లో మిస్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సినిమాకి మైనస్ అయ్యింది.

దీనికితోడు హీరోహీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ కూడా బాగాలేదు. ఆ లవ్ ట్రాక్ లో కాన్ ఫ్లిక్ట్ ను బిల్డ్ చేసి ఉంటే బాగుండేది. అలాగే హీరో శాపం ట్రాక్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు పేలవంగా అనిపిస్తాయి. దీనికితోడు కథలో లాజిక్స్ కూడా ఎక్కడా కనిపించవు. అసలు ఈ కథలో ఫుల్ కామెడీని మెయింటైన్ చేయవచ్చు. సెకండ్ హాఫ్ నిజంగానే కొన్ని చోట్ల ఫన్ తో సాగింది. ఆ ఫన్ ను కూడా దర్శకుడు శివ్ హరే సినిమా మొత్తం కంటిన్యూ చేయలేకపోయాడు. ఓవరాల్ గా ఈ ‘కిస్ కిస్ కిస్సిక్’ చిత్రంలో ఫన్ ఎలిమెంట్స్ అండ్ బోల్డ్ ఎలిమెంట్స్ ఉన్నా.. పూర్తి స్థాయిలో సినిమా ఆకట్టుకోదు.

సాంకేతిక విభాగం :

టెక్నికల్ గా చూసుకుంటే.. సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. ముఖ్యంగా డా. నిట్జ్ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అదే విధంగా అజయ్ పాండే సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఎడిటర్ మనోజ్ మగర్ ఎడిటింగ్ సినిమాకి తగ్గట్టు ఉంది. ఇక ఈ సినిమాలో నిర్మాత విధి ఆచార్య పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. శివ్ హరే దర్శకత్వం బాగున్నా.. స్క్రిప్ట్ మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు.

తీర్పు :

‘కిస్ కిస్ కిస్సిక్’ అంటూ వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్, హీరోకి ఉన్న శాపం తాలూకు ట్రాక్ లోని కొన్ని ఫన్ ఎలిమెంట్స్ బాగానే ఉన్నాయి. ఐతే, రెగ్యులర్ స్క్రీన్ ప్లే, మెయిన్ క్యారెక్టైజేషన్స్ బలహీనంగా ఉండటం, పైగా బోరింగ్ సీన్స్ వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. ఓవరాల్ గా ఈ చిత్రంలో కొన్ని ఫన్ అండ్ లవ్ సీన్స్ బాగానే ఉన్నా.. సినిమా మాత్రం ఆకట్టుకోలేకపోయింది.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team 

Exit mobile version