IPL 2025 : రాజస్థాన్ రాయల్స్‌పై కోల్‌కతా విజయం

ఐపీఎల్ 2025లో భాగంగా నేడు జరిగిన రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ చాలా సింపుల్‌గా సాగింది. టాస్ గెలిచిన కోల్‌కతా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు వచ్చిన రాజస్థాన్ రాయల్స్ వరుసగా వికెట్లు కోల్పోతుండటంతో భారీ స్కోర్‌ను నమోదు చేయలేకపోయింది. జైస్వాల్(29), సంజూ శామ్సన్(13), రియాన్ పరాగ్(25), ధృవ్ జురేల్(33) మినహా జట్టులో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది.

ఇక 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్‌లో ఓపెనర్ క్వింటన్ డి కాక్ (97 నాటౌట్) సూపర్ ఇన్నింగ్స్‌తో విజయాన్ని సునాయాసం చేశాడు. రహానే(18), అంగ్‌క్రిష్ రఘువంశీ (27 నాటౌట్) సాయంతో డి కాక్ 17.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 153 పరుగులతో కోల్‌కతాకు విజయాన్ని అందించాడు. కోల్‌కతా ఇప్పటివరకు 2 మ్యాచ్‌లు ఆడగా ఒక మ్యాచ్‌లో విజయాన్ని అందుకోగా, మరొక మ్యాచ్‌లో ఓటమి పాలైంది. ఇక రాజస్థాన్ ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ ఓటమి పాలై ఐపీఎల్ టేబుల్‌లో చివరి స్థానంలో నిలిచింది.

Exit mobile version