ఐపీఎల్ 2025లో భాగంగా జరిగిన KKR vs SRH మ్యాచ్‌లో సన్‌రైజర్స్ వరుసగా మరో ఓటమి పాలైంది. టోర్నీలో వరుసగా మూడు మ్యాచ్‌లలో సన్‌రైజర్స్ ఓటమిని నమోదు చేసుకుంది. ఇక కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన నేటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు వచ్చిన కోల్‌కతా ఓపెనర్లు వెంటవెంటనే ఔట్ అయ్యారు. కానీ, ఆ తర్వాత వచ్చిన మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్లు అజింక్య రహానే(38), అంగ్‌క్రిష్ రఘువంశీ(50), వెంకటేష్ అయ్యర్(60), రింకూ సింగ్(32 నాటౌట్) మంచి బ్యాటింగ్ ప్రదర్శన ఇవ్వడంతో కోల్‌కతా స్కోర్ పరుగులు పెట్టింది. 20 ఓవర్లలో కోల్‌కతా నైట్ రైడర్స్ 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు సాధించింది.
ఇక 201 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు వచ్చిన సన్‌రైజర్స్ మరోసారి పేలవమైన ఆటతీరును ప్రదర్శించింది. సన్‌రైజర్స్ ఓపెనర్లు సింగిల్ డిజిట్ స్కోర్‌కే పెవిలియన్ చేరారు. ఆ తర్వాత మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్లు నితీష్ కుమార్ రెడ్డి(19), కమిండు మెండిస్(27), క్లాసెన్(33) పరుగులతో జట్టును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ వరుసగా వికెట్లు పడుతుండటంతో 16.4 ఓవర్లలోనే SRH 120 పరుగులకు ఆలౌట్ అయ్యారు. దీంతో కోల్‌కతా 80 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది.