స్పందించిన మొట్టమొదటి తమిళ్ హీరో.. తెలుగు రాష్ట్రాలకి విరాళం


ప్రస్తుతం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదల భీభత్సం ఏ స్థాయిలో ఉందో తెలిసిందే. దీనితో మన తెలుగు స్టార్ హీరోలు దాదాపు అంతా కూడా భారీ మొత్తంలో విరాళాలు ప్రకటించారు. అలాగే అలాగే హీరోయిన్స్ నుంచి అయితే తెలుగు యంగ్ నటి అనన్య నాగళ్ళ 5 లక్షలు ప్రకటించింది. అయితే ఇప్పుడు మొట్ట మొదటి సారిగా ఓ తమిళ్ హీరో స్పందించి తన ఉదారత చాటుకున్నాడు.

మరి ఆ నటుడే శింబు. శింబు ఒకప్పుడు తెలుగులో కూడా సాలిడ్ హిట్స్ ని కొట్టాడు. మరి ఇప్పుడు తమిళ్ లో పలు చిత్రాలు చేస్తుండగా తన నుంచి మరీ అంత ఎక్కువ సినిమాలు తెలుగులో డబ్బింగ్ అయి రావడం లేదు అయినా కూడా ఇతర స్టార్స్ ని మించి తన గొప్ప మనసుని చాటుకున్నాడని చెప్పాలి.

మరి రెండు తెలుగు రాష్ట్రాలకి గాను శింబు 6 లక్షల విరాళాన్ని సహాయనిధి అందిస్తున్నట్టుగా తెలిపాడు. దీనితో తమిళ్ నుంచి తెలుగులో ఎన్నో సినిమాలు రిలీజ్ చేసుకుంటూ లాభాలు పొందిన హీరోలు చేయనిది మొట్టమొదటిగా శింబు చేసాడని తెలుగు ఆడియెన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి తనని చూసి మరింతమంది తమిళ హీరోలు ఏమన్నా స్పందిస్తారేమో చూడాలి.

Exit mobile version