మన టాలీవుడ్ లో కొన్ని క్రేజీ కాంబినేషన్ లు అలా ఒక మార్క్ ని సెట్ చేసుకొని ఉంటాయి. అవి దర్శకుడు, హీరో అయినా హీరో, సంగీత దర్శకుడు కావచ్చు లేదా దర్శకుడు, సంగీత దర్శకుడు కాంబో కూడా కావచ్చని చెప్పాలి. ఇలా ఉన్నటువంటి క్రేజీ కాంబినేషన్ లలో దర్శకుడు కొరటాల శివ అలాగే సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ల కాంబినేషన్ కూడా ఒకటి.
మరి వీరి నుంచి వచ్చిన నాలుగు సినిమాలు కూడదు ఒక్కటికీ డిజప్పాయింట్ చెయ్యలేదు అని చెప్పాలి. పాటలకు పాటలు అలాగే నేపథ్య సంగీతం కూడా ఒకింత ఎక్కువ మార్కులే ఆడియెన్స్ నుంచి అందుకున్నాయి. కానీ కొరటాల చేసిన ఈ లాస్ట్ రెండు సినిమాలకు మాత్రం ముఖ్యంగా నేపథ్యం సంగీత విషయంలో మిక్స్డ్ రెస్పాన్స్ నే అందుకున్నాయని చెప్పాలి.
లేటెస్ట్ దేవర ట్రైలర్ లో అనిరుద్ స్కోర్ పరంగా న్యూటరల్ ఆడియెన్స్ అంత ఎగ్జైటింగ్ గా కూడా మాట్లాడ్డం లేదు. దీనితో కొరటాల దేవిశ్రీప్రసాద్ ల కాంబినేషన్ నే ఒకప్పుడు వేరే లెవెల్లో ట్రీట్ ఇచ్చారని చెప్పాలి. ఒక మిర్చి గాని భరత్ అనే నేను, జనతా గ్యారేజ్ వరకు దేవి ఇచ్చిన వర్క్ ఏ పాటిదో తెలిసిందే. ఇది మాత్రం కొరటాల మార్క్ తో మిస్ అయ్యిందనే అనుకోవాలి.