ప్రస్తుతం భారీ హైప్ నడుమ బిగ్ స్క్రీన్స్ పై వచ్చేందుకు సిద్ధంగా ఉన్న సినిమా ఏదన్నా ఉంది అంటే ఆ చిత్రం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో చేసిన చిత్రం “దేవర” అనే చెప్పాలి. మరి ఈ భారీ సినిమాకి కూడా సీక్వెల్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇపుడు పార్ట్ 1 రాబోతుండగా పార్ట్ 2 పై ఇంట్రెస్టింగ్ క్లారిటీ బయటకి వచ్చింది.
కొరటాల పార్ట్ 2 పై మాట్లాడుతూ దేవర పార్ట్ 2 ని సరైన సమయంలోనే మొదలు పెట్టాలని ఎన్టీఆర్ సహా ఇతర నటీనటులు డేట్స్ అన్నీ పర్ఫెక్ట్ గా సెట్ అయితే తప్ప దేవర 2 మొదలు పెట్టనని క్లారిటీ ఇచ్చేసారు. ఒకవేళ బాగా లేట్ అవుతుంది అనిపిస్తే ఈ గాప్ లో మరో సినిమా స్టార్ట్ చేసేసి తర్వాత దేవర 2 మీదకు వస్తానని కొరటాల క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ భారీ చిత్రంకి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే రేపు సెప్టెంబర్ 27న చిత్రం భారీ రిలీజ్ కి రాబోతుంది.