Devara: ‘దేవర-3’పై కొరటాల కామెంట్.. ఏమన్నాడంటే..?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ ‘దేవర’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో మనం చూశాం. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన తీరుకి ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇక ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురుస్తోంది. కాగా, ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘దేవర-2’ కూడా ఉండనున్న విషయం తెలిసిందే.

అయితే, ఇప్పుడు దేవర సినిమా చూసిన చాలా మంది ‘దేవర-3’కి కూడా ఛాన్స్ ఉండొచ్చు అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్తపై కొరటాల శివ తాజాగా క్లారిటీ ఇచ్చేశాడు. ‘దేవర’ లాంటి చిత్రాన్ని నిజానికి ఒకే సినిమాగా తీయాలి. కానీ, ఈ సినిమాలోని పాత్రలను ఎస్టాబ్లిష్ చేసి వాటి ప్రాధాన్యతను తెలిపేందుకు ఈ సినిమాను రెండు భాగాలుగా చేయాల్సి వస్తుంది.. ఇక ‘దేవర-2’లోనే అసలు కథను ఎట్టి పరిస్థితుల్లో ముగించేయాలని ఆయన చెప్పాడు.

‘దేవర-3’ అంటూ మళ్లీ సినిమాను పొడిగిస్తే, ఆడియెన్స్‌లో ఆసక్తిని తగ్గించినట్లవుతుందని ఆయన అన్నారు. ఏ సినిమా అయినా రెండు భాగాల్లో ముగిస్తే, దానికి మంచి ఫలితాలు వస్తాయని కొరటాల కామెంట్ చేశాడు. దీంతో ఇక ‘దేవర-3’ అనే టాపిక్‌కి ఫుల్‌స్టాప్ పడ్డట్లే.

Exit mobile version