ఇంట్రెస్టింగ్..కొరియన్ వెర్షన్ “మనీ హెయిస్ట్” రిలీజ్ కి డేట్ ఫిక్స్.!

ఇంట్రెస్టింగ్..కొరియన్ వెర్షన్ “మనీ హెయిస్ట్” రిలీజ్ కి డేట్ ఫిక్స్.!

Published on Apr 29, 2022 1:00 PM IST

ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి వెబ్ సిరీస్ లలో గ్లోబల్ గా భాషతో సంబంధం అయినటువంటి సిరీస్ లు చాలానే ఉన్నాయి. అలాంటి బిగ్ హిట్స్ లో స్పానిష్ కి చెందిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ సిరీస్ “లకాసా డి పాపెల్” ఇంగ్లీష్ లో “ది మనీ హెయిస్ట్” కూడా ఒకటి. మొత్తం 5 సీజన్లగా వచ్చిన ఈ క్రేజీ వెబ్ సిరీస్ కి గత ఏడాది తో ఎండ్ కార్డు పడింది.

అయితే పలు భాషల్లో కూడా డబ్ అయ్యి నెట్ ఫ్లిక్స్ లో అత్యధికంగా వీక్షించిన వెబ్ సిరీస్ గా రికార్డు కూడా సెట్ చేసింది. మరి ఇంట పెద్ద సక్సెస్ అయ్యిన ఈ సిరీస్ ని వినూత్న వెబ్ కంటెంట్ తో ట్రీట్ ఇస్తూ గట్టి పోటీ ఇస్తున్న కొరియన్ సినిమా వారు కూడా రీమేక్ చేశారు. ఇప్పటికే కొరియన్ వెర్షన్ కంటెంట్ కి ఓటిటిలో యమ క్రేజ్ ఉంది. అలాంటిది ఈసారి మనీ హెయిస్ట్ లాంటి సిరీస్ ని వారు రీమేక్ చేసారు అంటే మంచి అంచనాలు కూడా నెలకొంటాయి.

మరి ఫైనల్ గా అయితే ఇపుడు ఈ క్రేజీ సిరీస్ రిలీజ్ కి డేట్ ఫిక్స్ అయ్యినట్టుగా తెలుస్తుంది. దీని ప్రకారం ఈ జూన్ 24న నెట్ ఫ్లిక్స్ ఈ సిరీస్ స్ట్రీమింగ్ కి రానుంది అట. ఆల్రెడీ ఆ వెర్షన్ కి చెందిన ఇంట్రెస్టింగ్ పోస్టర్ లు కూడా ఆల్రెడీ వైరల్ అవుతున్నాయి. మరి ఇందులో ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు