జనవరి 8 నుండి జెమినీ టీవీ లో “కొత్తగా రెక్కలొచ్చెనా”


తెలుగు ప్రేక్షకుల వినోదానికి కేరాఫ్ అడ్రస్ జెమినీ టీవీ. ఎన్నో కార్యక్రమాలను, మరిన్నో సీరియల్స్ ను మనకు అందించిన జెమినీ టీవీ ఇప్పుడు మనకు కొత్తగా రెక్కలొచ్చెనా అనే సరికొత్త సీరియల్ ను జనవరి 8 నుండి ప్రసారం చేయబోతోంది.

అందమైన పల్లెటూరి రైతుబిడ్డ కావేరి, తను ప్రేమించిన బావ నమ్మక ద్రోహం వల్ల ఒక వైపు తన తల్లి బందీగా మారినా, మరో వైపు తోడబుట్టిన చెల్లెలి భవిష్యత్తు ప్రశ్నగా మారినా, ఈ పరిగెత్తే ప్రపంచంలో తనవాళ్ళ కోసం ఓ రైతుగా, ఆత్మస్ధైర్యాన్ని కోల్పోకుండా ఎలా నిలబడిందో తెలిపే కావేరి కథే, కొత్తగా రెక్కలొచ్చెనా ఈ నెల 8 నుండి ప్రారంభం, సోమవారం నుండి శనివారం వరకు సా.6 గం. లకు.

పల్లెను వదిలి తనవాళ్ల కోసం పట్నం బయలుదేరిన కావేరి, రైతుగా, తాను కోల్పోయినవన్నీ తిరిగి ఎలా దక్కించుకుందనే కథాంశంతో నిర్మితమైన కొత్తగా రెక్కలొచ్చెనా సీరియల్లో సినీనటి ఆమనీ, బుల్లితెర స్టార్ ప్రభాకర్, సెల్వరాజ్, నిత్యా, అజయ్, కావ్య తదితర నటీనటులు నటించారు.

ఈ నెల 8 వ తేదీ సోమవారం సా 6 గం.లకు జెమిని టివి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ కొత్తగా రెక్కలొచ్చెనా సీరియల్ ప్రేక్షకుల ఆధారాభిమానాలను పొందడంలో ఎలాంటి సందేహం లేదని జెమినీ టీవీ యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేసారు.

Exit mobile version