సమీక్ష : కొత్తగా మా ప్రయాణం -బోరింగ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ !

సమీక్ష : కొత్తగా మా ప్రయాణం -బోరింగ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ !

Published on Jan 26, 2019 2:32 AM IST
kotthaga maa prayanam movie review

విడుదల తేదీ : జనవరి 25, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 1.75/5

నటీనటులు : ప్రియాంత్, యామిని భాస్కర్, భాను, కారుణ్య చౌదరి, జీవ

దర్శకత్వం : రమణ మొగిలి

సంగీతం : కార్తీక్ కుమార్ రొడ్రీగ్

ఎడిటర్ : నందమూరి హరి

ప్రియాంత్‌, యామిని భాస్కర్ జంటగా ఈ వ‌ర్షం సాక్షిగా` ఫేం ర‌మ‌ణ దర్శకత్వంలో నిశ్చ‌య్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకం పై తెరకెక్కిన చిత్రం `కొత్త‌గా మా ప్ర‌యాణం’. కాగా ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

 

కథ :

కార్తీక్ (ప్రియాంత్‌) ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి, అమ్మాయిలతో తిరుగుతూ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంటాడు. దీనికి తోడు హార్డ్‌ కోర్ మెంటాలిటీ.. ముక్కుసూటి గా ఉండే మనస్తత్వం.. ఇలాంటి వ్యక్తి కీర్తి (యామిని భాస్కర్)ను చూసి ప్రేమలో పడతాడు. అయితే ప్రేమా పెళ్లి పై అస్సలు నమ్మకం లేని కార్తీక్, కీర్తితో కలిసి సహాజీవనం చేద్దామని ఆమె వెంట పడుతూ ఉంటాడు. మరో పక్క కీర్తికి కూడా పెళ్లి పై సరైనా అభిప్రాయం ఉండడు. దాంతో కార్తిక్ తో సహా జీవనం చెయ్యడానికి అంగికరిస్తోంది.

ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఇద్దరికీ అభిప్రాయ భేదాలు వస్తాయి.
వాటికీ తోడు ఆ తర్వాత జరిగే కొన్ని అనుకోని సంఘటనల కారణంగా ఇద్దరు విడిపోతారు. ఆ తరువాత మళ్ళీ ఎలా కలిసారు ? ఆ అభిప్రాయ భేదాలను ఇద్దరూ ఎలా సాల్వ్ చేసుకున్నారు ? చివరికి కార్తిక్ అండ్ కీర్తి కలిసారా ? లేదా ? ఆ కలిసే క్రమంలో కార్తీక్ ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు ? లాంటి విషయాలు తెలయాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో హీరోగా నటించిన ప్రియాంత్‌ నటన పరంగా ఆకట్టుకున్నే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా కొన్ని కీలక సన్నివేశాల్లో ఎంతో అనుభవం ఉన్న నటుడిలా ఈజ్ తో సెటిల్డ్ గా నటించాడు. ముఖ్యంగా ఫ్రెండ్స్ తో సాగే సన్నివేశాల్లో గాని, అలాగే హీరోయిన్ తో సాగే రొమాంటిక్ సన్నివేశాల్లో గాని.. ప్రియాంత్‌ నటన ఆకట్టుకుంటుంది. ఇక ఎక్కువుగా సెల్ఫ్ రెస్పెక్ట్ కోరుకునే కీర్తి పాత్రలో నటించిన హీరోయిన్ యామిని భాస్కర్ తన నటనతో పాటు, రొమాంటిక్ సన్నివేశాల్లో ఆమె పలికించిన హావభావాలు మరియు క్లైమాక్స్ లో ఆమె నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది.

హీరోయిన్ కి ఫ్రెండ్ గా నటించిన నటి కూడా బాధ్యత గల భార్యగా, కథలో కాస్త సీరియస్ నెస్ తో పాటుగా.. కాస్త సెంటిమెంట్ ను కూడా పండించే ప్రయత్నం చేసింది. ఇక మిగిలిన నటీనటులు కూడా ఉన్నంతలో బాగానే చేశారు. దర్శకుడు కథలో కొన్ని భావోద్వేగ సన్నివేశాలతో ఆకట్టుకున్నే ప్రయత్నం అయితే చేసాడు.

 

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు సహా జీవనానికి సంబంధించి మంచి పాయింట్ ను తీసుకున్నారు కానీ ఆ పాయింట్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథనాన్ని రాసుకోలేదు. హీరో, హీరోయిన్ల మధ్యన వచ్చే ఘర్షణ తాలూకు సన్నివేశాలు కూడా పూర్తిగా ఆకట్టుకున్నే విధంగా ఉండవు. దీనికి తోడు సినిమాలోని కీలక సన్నివేశాలు కూడా మరీ సినిమాటిక్ గా అనిపిస్తాయి.

పైగా హీరో హీరోయిన్ల మధ్య అవసరానికి మించి మాస్ మసాలా సన్నివేశాలు, ముద్దులు ఎక్కువైపోయాయి. హీరో క్యారెక్టరైజేషన్ కూడా మరీ నాటకీయంగా అనిపిస్తోంది. దానికి తోడు ఓవర్ బిల్డప్ షాట్స్.. ఓవర్ ఫైట్స్ కూడా ప్రేక్షకులను కొంత అసహనానికి గురి చేస్తాయి.

 

సాంకేతిక విభాగం :

దర్శకుడు మంచి స్టోరీ లైన్ తీసుకున్నా.. ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా మలచలేకపోయారు.

సంగీత దర్శకుడు కార్తీక్ అందించిన నేపధ్య సంగీతం ఈ సినిమాకి చాలా ప్లస్ అయింది. ఆయన అందించిన పాటల్లో ఒకటి ఆకట్టుకుంటుంది. అలాగే సినిమాటోగ్రఫి కూడా బాగుంది. ఇక సినిమాలోని నిర్మాణ విలువ‌లు సినిమాకి తగ్గట్లే ఉన్నాయి.

 

తీర్పు :

ప్రియాంత్‌, యామిని భాస్కర్ జంటగా ర‌మ‌ణ దర్శకత్వంలో వచ్చిన ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఏ మాత్రం ఆసక్తికరంగా సాగలేదు. అయితే ఒకటి రెండు ఎమోషనల్ సన్నివేశాలు, హీరో హీరోయిన్ల మధ్య సాగే రొమాంటిక్ సన్నివేశాలు ‘సి’ సెంటర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇక మిగిలిన చాలా సన్నివేశాలు ఆసక్తికరంగా సాగకపోగా విసిగిస్తాయి. దీనికి తోడు కథనం కూడా మరి సినిమాటిక్ గా సాగుతుంది. పైగా హీరోకి సంబంధించి ఓవర్ బిల్డప్ షాట్స్.. ఓవర్ ఫైట్స్ కూడా ప్రేక్షకులను కొంత అసహనానికి గురి చేస్తాయి. మరి ఇలాంటి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారనేది చూడాలి.

 

123telugu.com Rating : 1.75/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు