ఘనంగా ‘కౌసల్య తనయ రాఘవ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్

ఘనంగా ‘కౌసల్య తనయ రాఘవ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్

Published on Apr 5, 2025 7:27 AM IST

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న స్వచ్చమైన వింటేజ్ విలేజ్ లవ్ ఎమోషనల్ డ్రామా మూవీ ‘కౌసల్య తనయ రాఘవ’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. రాజేష్ కొంచాడా, శ్రావణి శెట్టి నటీనటులుగా ఏఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై అడపా రత్నాకర్ నిర్మిస్తున్న ఈ మూవీకి స్వామి పట్నాయక్ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ సినిమాను ఏప్రిల్ 11న రిలీజ్ చేసేందుకు దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ట్రైలర్ లాంచ్ అనంతరం హీరో రాజేష్ మాట్లాడుతూ.. ‘నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. కౌసల్య తనయ రాఘవ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరికి మంచి పేరు వస్తుంది. ఈ చిత్రం అద్భుతంగా వచ్చింది. ఏప్రిల్ 11న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

దర్శకుడు స్వామి పట్నాయక్ మాట్లాడుతూ.. ‘కౌసల్య తనయ రాఘవ సినిమా అద్భుతంగా వచ్చింది. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్. నిర్మాత రత్నాకర్ ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. రాజేష్, శ్రావణి, ఆర్కే నాయుడు ఇలా అందరూ అద్భుతంగా నటించారు. మా చిత్రం ఏప్రిల్ 11న రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

నిర్మాత రత్నాకర్ మాట్లాడుతూ .. ‘కౌసల్య తనయ రాఘవ సినిమాకు సహకరించిన ప్రతి ఒక్కరికి థాంక్స్. ఈ చిత్రాన్ని స్వామి పట్నాయక్ అద్భుతంగా తెరకెక్కించారు. రాజేష్, శ్రావణి చక్కగా నటించారు. మా చిత్రం ఏప్రిల్ 11న విడుదల కానుంది. అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.

నటుడు ఆర్కే నాయుడు మాట్లాడుతూ .. ‘ట్రైలర్‌ను అద్భుతంగా కట్ చేశారు. ప్రస్తుతం ట్రైలర్‌ను చూస్తే ఆడియెన్స్ థియేటర్లకు వస్తున్నారు. ఇందులో నేను ఓ ముఖ్యమైన పాత్రను పోషించాను. ఆ క్యారెక్టర్ అందరికీ నచ్చుతుంది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.

నటుడు చంటి మాట్లాడుతూ .. ‘కౌసల్య తనయ రాఘవ టీంతో నాకు రెండేళ్లుగా పరిచయం ఉంది. ఈ సినిమా కోసం టీం అంతా చాలా కష్టపడింది. సినిమా అద్భుతంగా వచ్చింది. రాజేష్ గొప్పగా నటించాడు. నాయుడు, స్వామి ఇలా అందరూ చక్కగా నటించారు. ఈ సినిమాను థియేటర్ లో చూడండి. నేను ఆల్రెడీ చూశాను. మదర్ సెంటిమెంట్‌ను చక్కగా చూపించారు. ఏప్రిల్ 11న సినిమాను అందరూ చూడండి’ అని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు