కృష్ణ చైతన్య డైరెక్షన్ లో విశ్వక్ సేన్ నెక్స్ట్ మూవీ!

కృష్ణ చైతన్య డైరెక్షన్ లో విశ్వక్ సేన్ నెక్స్ట్ మూవీ!

Published on Mar 29, 2023 11:58 AM IST

మాస్ కా దాస్ విశ్వక్సేన్ ప్రస్తుతం తన తాజా అవుటింగ్ దస్ కా ధమ్కీ గ్రాండ్ సక్సెస్‌ తో దూసుకుపోతున్నాడు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో కూడా ఈ చిత్రం మంచి బిజినెస్ చేస్తోంది. ఈ రోజు విశ్వక్ సేన్ పుట్టిన రోజు సందర్భంగా తన కొత్త సినిమాని ప్రకటించారు. VS11 అని తాత్కాలికంగా పేరు పెట్టబడిన ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహించనున్నారు.

మేకర్స్ ప్రకారం, విశ్వక్సేన్ మునుపెన్నడూ లేని మాస్ పాత్రలో కనిపించనున్నాడు. హీరోయిన్, ఇతర నటీనటులు, సిబ్బంది వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ ఎంటర్టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో రాజమండ్రిలో ప్రారంభం కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు