సమీక్ష : “కృష్ణ గాడు అంటే ఒక రేంజ్” – డిజప్పాయింట్ చేసే గ్రామీణ డ్రామా

సమీక్ష : “కృష్ణ గాడు అంటే ఒక రేంజ్” – డిజప్పాయింట్ చేసే గ్రామీణ డ్రామా

Published on Aug 4, 2023 5:36 PM IST
Krishna Gadu Ante Oka Range Movie Review in Telugu

విడుదల తేదీ : ఆగస్టు 4, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు: రిష్వి, విస్మయ తదితరులు

దర్శకుడు : రాజేష్ దొండపాటి

నిర్మాతలు: పెట్ల కృష్ణ మూర్తి, పెట్ల వెంకట సుబ్బమ్మ, PNK శ్రీలత

సంగీతం: సాబు వర్గేసే

సినిమాటోగ్రఫీ: ఎస్ కె రఫీ

ఎడిటర్: సాయి బాబు తలారి

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

రిష్వి, విస్మయ జంటగా నటించిన చిన్న బడ్జెట్ సినిమా కృష్ణ గాడు అంటే ఒక రేంజ్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ గ్రామీణ నేపధ్య సినిమాకి రాజేష్ దొండపాటి దర్శకత్వం వహించారు. మరి అది ఎలా ఉందో సమీక్ష లో చూద్దాం.

 

కథ :

 

కృష్ణ (రిష్వి) చిన్నతనంలోనే తండ్రిని కోల్పోతాడు. వితంతువు అయిన తన తల్లిని చూసుకోవడానికి అతడు చాలా కష్టపడుతుంటాడు. కృష్ణ జీవితంలో ప్రధాన లక్ష్యం ఇల్లు కట్టుకోవడం. ఇది అతని మరణించిన తండ్రి లక్ష్యం కూడా. అయితే అతను సత్య (విస్మయ)ని ఒక ఫంక్షన్‌లో కలుస్తాడు మరియు అనంతరం ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడతారు. స్థానిక గూండా మరియు వక్రబుద్ధిగల దయా (రఘు) కారణంగా వారి ప్రేమానుబంధం సమస్యల్లో ఇరుక్కుంటుంది. దయ కూడా సత్యను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు, అందుకే కృష్ణ అతనితో గొడవకు దిగుతాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది కృష్ణుడు సత్యని పెళ్లి చేసుకున్నాడా అతను తన లక్ష్యాన్ని సాధించాడా లేదా అనేది మిగిలిన కథలో భాగం. అవన్నీ మనం వెండితెర పై చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

హీరో రిష్వీ ఈ సినిమాలో డీసెంట్ పెర్ఫార్మెన్స్ కనబరిచాడు. మేనమామపై ఆవేశపడే సన్నివేశంలో అతని నటన బాగుంది. విస్మయ పల్లెటూరి అమ్మాయిగా సహజంగా కనిపించింది మరియు ఆమె హుందాగా నటించింది. రెండు సీన్లలో తల్లి సెంటిమెంట్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకి అద్భుతమైన సాంగ్స్ ని సాబు వర్గేసె అందించారు. సాంగ్స్ అన్ని కూడా చక్కగా కుదిరాయి, వాటిని కూడా చక్కగా చిత్రీకరించారు.

 

మైనస్ పాయింట్స్ :

 

ముఖ్యంగా ఈ సినిమాని ముందుకు నడిపించే బలమైన ఎమోషనల్ అంశాలు ఏమి లేవు. మూడు నెలల్లో ఇల్లు కట్టిస్తానని కథానాయకుడు ఛాలెంజ్ చేస్తాడు, కానీ సెకండాఫ్‌లో ఈ అంశం పెద్దగా హైలైట్ కాలేదు. అలాగే ప్రేమకథ పూర్తిగా పక్కదారి పట్టింది. బదులుగా, స్క్రీన్‌ప్లే లక్ష్యం లేకుండా తిరుగుతూ, ఆడియన్స్ సహనాన్ని పరీక్షిస్తుంది. సినిమా ముందుకి నడుస్తున్న కొద్దీ, మెయిన్ ప్లాట్‌తో సంబంధం లేకుండా వచ్చే ఓవర్ ది టాప్ యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకోవు. చాలావరకు రిపీటెడ్ సన్నివేశాలు ఉన్నాయి, ఇవి సినిమా నిడివిని బాగా పెంచేసాయి. అసలు మేకర్స్ ఏమి చెప్పాలనుకుంటున్నారు అనేది సినిమాలో అస్పష్టంగా ఉంది. మరో ప్రధాన లోపం ఏమిటంటే, సినిమా టైటిల్‌ కథకు సెట్ కాలేదు. కృష్ణ గాడు అంటే ఒక రేంజ్ అనే డైలాగ్‌ని మనం ప్రతి పది నిమిషాలకు ఒకసారి వింటూనే ఉంటాం, కానీ దానిని నిజం చేసే సన్నివేశాలు లేవు. ఆశ్చర్యకరంగా టైటిల్‌కు భిన్నంగా హీరోని అంతటా పిరికి వ్యక్తిగా చూపించారు. మరీ ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలను పేలవంగా డిజైన్ చేశారు.

 

సాంకేతిక వర్గం :

 

సాబు వర్గేసే సంగీతం ఈ గ్రామీణ నేపధ్య సినిమాలో ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రాఫర్ ఎస్‌కే రఫీ పల్లెటూరి దృశ్యాలను కూల్‌గా తీశారు. ఎడిటింగ్ టీమ్ చాలావరకు అనవసరమైన సన్నివేశాలను కత్తిరించాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. దర్శకుడు రాజేష్ దొండపాటి విషయానికి వస్తే, అతను సినిమాతో చాలావరకు నిరాశపరిచాడు. కృష్ణ గాడు అంటే ఒక రేంజ్ లో బలమైన పాయింట్ లేకపోవడంతో పాటు డ్రామా కూడా ఏమీ లేదు. అందువల్ల ప్రొసీడింగ్స్ ఆడియన్స్ లో ఎలాంటి ఉత్కంఠను సృష్టించవు. ఆయన స్క్రిప్ట్ ని మరింత బలంగా రాసుకుని ఉండాల్సింది.

 

తీర్పు :

 

మొత్తంగా కృష్ణ గాడు అంటే ఒక రేంజ్ దాని టైటిల్‌ని ఏమాత్రం జస్టిఫై చేయదు సరికదా చాలా సాగతీత సన్నివేశాలతో నీరసంగా సాగుతుంది. హీరో హీరోయిన్స్ ఇద్దరూ ఆకట్టుకున్నారు. మరియు ఈ సినిమాలో సాంగ్స్ మాత్రం ఆకట్టుకుంటాయి. ఇక హీరో పాత్రని సరిగ్గా డిజైన్ చేయలేదు. సెకండ్ హాఫ్ ఎటువంటి కారణం లేకుండా పొడిగించబడింది మరియు మెయిన్ పాయింట్ పూర్తిగా పక్కన పెట్టబడింది. అందువల్ల ఇది నిరాశపరిచే సినిమాగా మిగిలిపోతుంది.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు