“చందమామ” సీక్వెల్ పై కృష్ణవంశీ క్లారిటీ.!

“చందమామ” సీక్వెల్ పై కృష్ణవంశీ క్లారిటీ.!

Published on Jul 22, 2024 8:00 AM IST

మన టాలీవుడ్ ఆడియెన్స్ లో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అనే మాట వచ్చినపుడు అందులో ఖచ్చితంగా ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన చిత్రాల ప్రస్తావన తప్పక రాకుండా ఉండదు. ఒక టైం లో తాను తీసిన ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తెలుగు ఆడియెన్స్ ని ఎంతగానో అలరించాయి. మరి అలా చేసిన పలు హిట్ చిత్రాల్లో యంగ్ హీరో నవదీప్ అలాగే కాజల్ అగర్వాల్ కాంబినేషన్ లో చేసిన ఎంటర్టైనర్ చిత్రం “చందమామ” కోసం తెలియని ఫ్యామిలీ ఆడియెన్స్ ఉండరు.

మరి ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందా లేదా అనే దానిపై కృష్ణ వంశీ క్లారిటీ ఇచ్చారు. ఆ సినిమాకి సీక్వెల్ ఏమీ లేదని, ఈ పార్ట్ 2 లు సీక్వెల్స్ అనేవి నాకు అర్ధం కావు అంటూ రియల్లీ ఇచ్చేసి తేల్చేసారు. దీనితో ఈ సినిమా అనే కాదు అసలు ఏ సినిమా సీక్వెల్స్ విషయంలో కూడా ఆయన ఆసక్తిగా లేరనే చెప్పాలి. ఇక ఈ చిత్రానికి కే ఎం రాధా కృష్ణన్ సంగీతం అందించగా శివ బాలాజీ, నాగబాబు, సింధు మీనన్ తదితరులు ఈ చిత్రంలో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు