‘రంగమార్తాండ’ విషయంలో చివరికి అలా జరిగిందన్నమాట ?

Published on Oct 17, 2020 3:00 am IST

కృష్ణవంశీ ప్రస్తుతం ‘రంగమార్తాండ’ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ దశలో ఉండగా లాక్ డౌన్ రావడంతో షూటింగ్ ఆగిపోయింది. ఇంకా ఫైనల్ షెడ్యూల్ ఒకటి మిగిలి ఉంది. కొంత గ్యాప్ తీసుకున్న కృష్ణవంశీ నుండి వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. కృష్ణవంశీ సైతం చిత్రాన్ని అన్ని విధాలా గొప్పగా ఉండేలా రూపొందిచాలని అనుకున్నారు. అందుకే మాస్ట్రో ఇళయరాజాగారి చేత సంగీతం చేయించుకున్నారు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం లాంటి సీనియర్ నటీనటుల్ని తీసుకున్నారు.

చిత్రాన్ని గొప్పగా థియేటర్లలో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా రీత్యా సినిమా హాళ్లకు ఇప్పుడప్పుడే నార్మల్ పరిస్థితి వచ్చేలా కనిపించట్లేదు. ప్రేక్షకులు పూర్తిగా థియేటర్ల వైపుకు రావాలంటే ఇంకో రెండు మూడు నెలలు పట్టేలా ఉంది. దీంతో సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేయాలనే నిర్ణయానికి నిర్మాతలు వచ్చినట్టు వార్తలు చలామణీ అవుతున్నాయి. మరి వీటిలో నిజం ఎంత అనేది చిత్ర యూనిట్ స్పందిస్తేనే తెలుస్తుంది. మధు కలిపు, అభిషేక్ జవ్కర్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం మరాఠీ సినిమా ‘నటసామ్రాట్’కు రీమేక్. ఈ సినిమా మీద కృష్ణ వంశీ చాలా నమ్మకంతో ఉన్నారు.

సంబంధిత సమాచారం :

More