ఓటిటిలో సూపర్ రెస్పాన్స్ తో “కృష్ణ వ్రిందా విహారి”.!


లేటెస్ట్ గా టాలీవుడ్ లో రిలీజ్ అయ్యి మంచి హిట్ అయ్యిన చిత్రాల్లో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగ శౌర్య హీరోగా యంగ్ హీరోయిన్ షిర్లే సెటియా టాలీవుడ్ డెబ్యూ ఇచ్చిన చిత్రం “కృష్ణ వ్రిందా విహారి”. దర్శకుడు అనీష్ కృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రం మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కగా థియేటర్స్ లో మంచి రన్ ను అందుకుంది.

ఇక దీని తర్వాత అయితే ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కి రాగా ఇందులో ఈ చిత్రం నేషనల్ వైడ్ సూపర్ రెస్పాన్స్ రావడం విశేషం. మరి నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రం వచ్చిన తర్వాత నుంచి వారం రోజులు కంటిన్యూస్ గా ఇండియా వైడ్ నెంబర్ 1 స్థానం ట్రెండింగ్ లో నిలవడం విశేషం.

దీనితో అయితే ఈ చిత్రం ఓటిటి లో కూడా సూపర్ సక్సెస్ అందుకుంది అని చెప్పాలి. మరి ఈ చిత్రానికి అయితే మహతి స్వర సాగర్ సంగీతం అందించగా ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాణం వహించారు.

Exit mobile version