‘కృష్ణ వ్రింద విహారి’ సెన్సార్ కంప్లీట్, రన్ టైం ఎంతంటే …?

Published on Sep 22, 2022 4:02 pm IST

యువ నటుడు నాగశౌర్య హీరోగా షిర్లే సెటియా హీరోయిన్ గా యువ దర్శకుడు అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఉష మూల్పూరి నిర్మాతగా ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కృష్ణ వ్రింద విహారి. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్, సాంగ్స్, థియేట్రికల్ ట్రైలర్ అన్ని కూడా మూవీ పై అంచనాలు మరింతగా పెంచాయి.

ఇక రేపు భారీ స్థాయిలో రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ మూవీ యొక్క సెన్సార్ కార్యక్రమాలు నేడు పూర్తి అయ్యాయి. ఈ మూవీకి యు/ఏ సర్టిఫికెట్ కేటాయించారు సెన్సార్ సభ్యులు. కాగా ఈ మూవీ మొత్తం 2 గంటల 19 నిమిషాల రన్ టైం సాగనుంది. రాధికా శరత్ కుమార్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి తదితరులు కీలక రోల్స్ చేసిన ఈ మూవీకి మహతి స్వర సాగర్ సంగీతం అందించగా సాయి శ్రీరామ్ కెమెరా మ్యాన్ గా వర్క్ చేసారు. తామందరి ఈ ప్రయత్నం తప్పకుండా ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందని మొన్నటి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా హీరో నాగశౌర్య మాట్లాడుతూ చెప్పారు.

సంబంధిత సమాచారం :