‘విజయ్ దేవరకొండ’ ఖుషి లో కృతి శెట్టి ?

Published on Dec 5, 2022 7:00 am IST

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ – సమంత కలయికలో శివ నిర్వాణతో ఖుషి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో మరో హీరోయిన్ ఓ స్పెషల్ రోల్ చేయబోతుంది. హీరోయిన్ కృతి శెట్టి ఈ చిత్రం సెకండాఫ్ లో వచ్చే ఓ కీలక పాత్రలో నటిస్తోందట. పైగా కృతి శెట్టి క్యారెక్టర్ చాలా వినూత్నంగా ఉండబోతుందట. నెగిటివ్ షేడ్స్ తో సాగే ఈ క్యారెక్టర్ చివరకు ఎమోషనల్ గా ఎలా టర్న్ తీసుకుంది ?, అలాగే, లవ్ విషయంలో పూర్తి పాజిటివ్ క్యారెక్టర్ గా ఎలా మారింది ? అనే కోణంలో కృతి శెట్టి పాత్ర సాగుతుందట.

అయితే, ఈ వార్త పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఈ సినిమా కథ ఒక మెచ్యూర్డ్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. శివ నిర్వాణ సినిమా అంటేనే హుందాగా ఉండే ప్రేమ కథలకు కేరాఫ్ అడ్రెస్. అయన గత చిత్రాలు ‘మజిలీ, నిన్ను కోరి’లో హృదయానికి హత్తుకునే ప్రేమ కథలు ఉంటాయి. ఆ తరహాలోనే విజయ్ చిత్రం కోసం కూడా మంచి ప్రేమ కథను రాసుకున్నారట శివ నిర్వాణ.

సంబంధిత సమాచారం :