ఇంట‌ర్వ్యూ : కృతి శెట్టి – ‘మ‌న‌మే’ ఓ స‌రికొత్త అనుభూతినిచ్చింది

ఇంట‌ర్వ్యూ : కృతి శెట్టి – ‘మ‌న‌మే’ ఓ స‌రికొత్త అనుభూతినిచ్చింది

Published on May 31, 2024 10:00 PM IST

యంగ్ హీరో శ‌ర్వానంద్, అందాల భామ కృతి శెట్టి జంట‌గా తెరకెక్కిన ‘మ‌న‌మే’ మూవీ జూన్ 7న‌ రిలీజ్ కానుంది. శ్రీ‌రామ్ ఆదిత్య తెర‌కెక్కిస్తున్న ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ లో చిత్ర యూనిట్ బిజీగా మారింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్ కృతి శెట్టి ప‌లు ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను మీడియాతో పంచుకుంది.

మ‌న‌మే లో మీ పాత్ర ఎలా ఉంటుంది.. మీ రియ‌ల్ లైఫ్ కు ఏమైనా పోలిక ఉందా?

ఈ సినిమాలో నా పాత్ర పేరు సుభ‌ద్ర‌. నేను ఇప్ప‌టివ‌ర‌కు చేయ‌ని క్యారెక్ట‌ర్ ను ద‌ర్శ‌కుడు నాకు ఇచ్చారు. నా పాత్ర చాలా కొత్త‌గా, స్ట్రిక్ట్ గా ఉంటుంది. నా రియ‌ల్ లైఫ్ కు పూర్తి భిన్న‌మైన పాత్ర‌లో క‌నిపిస్తాను. ఈ పాత్ర నాకు ఓ స‌రికొత్త అనుభూతిని ఇచ్చింది.

ఈ సినిమాలో మీరు త‌ల్లిగా కనిపిస్తారా..?

అది మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.. సినిమా చూస్తేనే నా పాత్ర ఏమిట‌నేది మీకు పూర్తిగా అర్థ‌మ‌వుతుంది.

శ‌ర్వానంద్ గారితో పనిచేయ‌డం ఎలా అనిపించింది..?

నేను చూసిన అతికొద్ది మంది ఫైనెస్ట్ ప‌ర్ఫార్మర్ ల‌లో శ‌ర్వానంద్ గారు ఒక‌రు. ఎలాంటి సీన్ అయినా అల‌వోక‌గా చేసేస్తారు. ఓ సీన్ లో నేను ఎలా చేయాలా అని చాలా టెన్ష‌న్ ప‌డ్డాను. కానీ శ‌ర్వానంద్ గారు చాలా కామ్ గా వ‌చ్చి సీన్ పూర్తి చేశారు. ఆయ‌న ప‌ర్ఫార్మెన్స్ ను మ్యాచ్ చేయ‌డం చాలా క‌ష్టం.

డైరెక్ట‌ర్ ఈ క‌థ చెప్పిన‌ప్పుడు మీకు ఏం న‌చ్చింది..?

శ్రీరామ్ ఆదిత్య గారు ఈ క‌థ చెప్పిన‌ప్పుడే ఇందులో చాలా బ‌ల‌మైన ఎమోష‌న్ ఉంద‌ని అర్థ‌మైంది. గ్లోబ‌ల్ ఆడియెన్స్ క‌నెక్ట్ అయ్యే ఎలిమెంట్ ఇందులో ఉండ‌టం, సినిమా క‌థ మొత్తం మెయిన్ క్యారెక్ట‌ర్స్ చుట్టూ తిర‌గ‌డం నాకు బాగా న‌చ్చింది.

ఈ సినిమా సంగీతం ఎలా ఉండ‌బోతుంది..?

హేషం గారు అద్భుత‌మైన ట్రాక్ అందించారు. ప్ర‌తి పాట ఆడియెన్స్ ను మెప్పిస్తుంది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగా న‌చ్చుతుంది.

పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీలో వ‌ర్క్ చేయ‌డం ఎలా అనిపించింది..?

విశ్వ ప్రసాద్ గారు చాలా ప్యాష‌న్ ఉన్న ప్రొడ్యూస‌ర్. ఆర్టిస్టుల‌తో పాటు టెక్నీషియ‌న్ల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు.

ఎలాంటి పాత్ర‌లంటే మీకు ఇష్టం..?

నాకు ప్రిన్సెస్ త‌ర‌హా పాత్ర‌లంటే చాలా ఇష్టం. బాహుబ‌లిలో అనుష్క గారు చేసిన పాత్ర లాంటివి చేయాలని ఉంది. యాక్ష‌న్, మార్ష‌ల్ ఆర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ పాత్ర‌లైనా చేస్తాను.

మీ రాబోయే సినిమాలు..?

ప్ర‌స్తుతం త‌మిళ్ లో మూడు సినిమాలు చేస్తున్నాను. మ‌లయాళంలో ఒకటి చేస్తున్నాను.

ఆల్ ది బెస్ట్…-థ్యాంక్ యూ

సంబంధిత సమాచారం

తాజా వార్తలు