దీపావళి సర్‌ప్రైజ్ పట్టుకొస్తున్న ‘కుబేర’.. ఏమై ఉంటుంది?

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న చిత్రాల్లో ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ ‘కుబేర’పై ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాలో కింగ్ అక్కినేని నాగార్జున, తమిళ హీరో ధనుష్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజ్ అయిన పోస్టర్స్ సినిమాపై మంచి పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశాయి.

ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుండగా, ఈ చిత్రం నుండి దీపావళి కానుకగా ఓ సర్‌ప్రైజ్ ట్రీట్ రానుందని సినీ సర్కిల్స్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ‘కుబేర’ మూవీ నుండి ఓ పవర్‌ఫుల్ గ్లింప్స్‌ను దీపావళి కానుకగా రిలీజ్ చేస్తారని.. దీంతో పాటు చిత్ర రిలీజ్ డేట్‌ని కూడా వారు అనౌన్స్ చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమాపై ఒక్కసారిగా బజ్ పెరిగింది.

ఈ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే విధంగా దర్శకుడు రూపొందిస్తున్నాడని.. ఈ సినిమాతో శేఖర్ కమ్ముల మరోసారి బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్ అందుకుంటాడని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

Exit mobile version