సీనియర్ హీరోయిన్ కుష్బూ షాకింగ్ కామెంట్స్ చేసింది. తనకు 8 ఏళ్ల వయసున్నప్పుడే తాను లైంగిక వేధింపులకు గురయ్యానని కుష్బూ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ కుష్బూను లైంగికంగా వేధించింది ఎవరో తెలుసా ?, ఆమె తండ్రి అట. తన తండ్రే తనను లైంగికంగా వేధించేవాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కుమార్తెను లైంగికంగా వేధించడం తన జన్మహక్కు గా తన తండ్రి భావించేవాడని ఆమె పేర్కొంది.
అయితే తనకు 15 ఏళ్ల వయస్సు వచ్చాక అతనిని ఎదిరించడం ప్రారంభించానని, దాంతో 16 ఏళ్లకు తమ కుటుంబాన్ని వదిలిపెట్టి తన తండ్రి వెళ్లిపోయాడని ఆమె వివరించింది. ప్రస్తుతం కుష్బూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కుష్బూ ప్రస్తుతం జాతీయ మహిళ కమిషన్ మెంబర్ గా ఉన్నారు. కుష్బూ హేతువాది, ప్రజల పట్ల సమాజం పట్ల, ఆమెకు చాలా అవగాహన ఉంది. ఆమె ఒక ముస్లిం కుటుంబంలో పుట్టారు.


