అప్పుడే “ఖుషి” రీ రిలీజ్ కి డేట్ ఫిక్స్ అయ్యిందా?

Published on Sep 25, 2022 12:22 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హిట్ చిత్రాల్లో తన కెరీర్ లో ఫస్ట్ ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ చిత్రం “ఖుషి” కూడా ఒకటి. దర్శకుడు ఎస్ జె సూర్య తెరకెక్కించిన ఈ చిత్రంతో అప్పట్లో యూత్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ని పవన్ మరింత స్థాయిలో సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు ఈ సినిమా వచ్చి రెండు దశాబ్దాలు గడిచిపోగా ఈ ఏడాదిలో పవన్ అభిమానులు ఈ చిత్రాన్ని 4కే లో రీ రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు.

కానీ దాని స్థానంలో “జల్సా” వచ్చింది. ఇక దీనితో వచ్చే ఏడాదిలో ఈ సినిమా రీ రిలీజ్ ఉంటుంది అని టాక్ రాగా ఇప్పుడు అయితే మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తుంది. ఈ సినిమా రీ రిలీజ్ ఈ ఏడాది డిసెంబర్ 31నే ఉంటుందట. మరి దీనిపై అధికారిక అప్డేట్ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి అయితే మణిశర్మ సంగీతం అందించగా భూమిక హీరోయిన్ గా నటించింది అలాగే ఏ ఎం రత్నం నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :