‘డ‌బుల్ ఇస్మార్ట్’ నుంచి ”క్యా ల‌ఫ్డా” సాంగ్ ప్రోమో

‘డ‌బుల్ ఇస్మార్ట్’ నుంచి ”క్యా ల‌ఫ్డా” సాంగ్ ప్రోమో

Published on Jul 27, 2024 4:25 PM IST

యంగ్ అండ్ ఎన‌ర్జిటిక్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని న‌టించిన లేటెస్ట్ మూవీ ‘డ‌బుల్ ఇస్మార్ట్’ ఇప్పటికే షూటింగ్ ప‌నులు ముగించుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉంది. ఈ సినిమాను డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాధ్ డైరెక్ట్ చేస్తుండ‌టంతో ఈ సినిమాపై అంచ‌నాలు నెక్ట్స్ లెవెల్ లో క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా నుండి వ‌రుస అప్డేట్స్ ఇస్తూ మేక‌ర్స్ అభిమానుల‌ను ఖుషీ చేస్తున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి మ‌రో సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ”క్యా ల‌ఫ్డా” అనే సాంగ్ ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. శ్రీ‌హ‌ర్ష ఈమ‌ని లిరిక్స్ అందించిన ఈ సాంగ్ ను ధ‌నుంజ‌య్, సింధుజ శ్రీ‌నివాస‌న్ క‌లిసి పాడారు. ఇక మ‌ణిశ‌ర్మ మ‌రోసారి త‌న మ్యూజిక్ తో మ్యాజిక్ చేయ‌నున్నాడని ఈ ప్రోమో చూస్తే అర్థ‌మ‌వుతోంది.

ఈ సినిమాలో అందాల భామ కావ్య థాప‌ర్ హీరోయిన్ గా నటిస్తోండ‌గా బాలీవుడ్ న‌టుడు సంజ‌య్ ద‌త్ విల‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. గెటప్ శ్రీ‌ను, అలీ, షాయాజీ షిండే, మార్కండ్ దేశ్పాండే, టెంప‌ర్ వంశీ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. పూరి క‌నెక్ట్స్ బ్యాన‌ర్ పై పూరి జ‌గ‌న్నాధ్, ఛార్మీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాను ఆగ‌స్టు 15న రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ సిద్ధ‌మ‌య్యారు.

వీడియో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు