మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, వెర్సటైల్ యాక్టర్ కమ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ చిత్రం ‘L2 : ఎంపురాన్’ బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. లూసిఫర్ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాపై మొదట్నుంచీ మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా రిలీజ్‌కు ముందే సాలిడ్ బజ్ క్రియేట్ చేయడంతో భారీ ఓపెనింగ్స్ అందుకుంది.
ఈ సినిమా మార్చి 27న గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఇక ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ దక్కుతుండటంతో పాటు అదిరిపోయే కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల గ్రాస్ మార్క్ దాటినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. అయితే, కేవలం 5 రోజుల్లోపే ఇలాంటి ఫీట్ చేయడం మలయాళ చిత్రాల్లో రేర్ అని సినీ సర్కిల్స్ కామెంట్ చేస్తున్నాయి.
ఈ సినిమాలో టోవినో థామస్, మంజు వారియర్, అభిమన్యు సింగ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు దీపక్ దేవ్ సంగీతం అందించారు. మరి ఈ సినిమా టోటల్ రన్‌లో ఎంతమేర వసూళ్లు రాబడుతుందో చూడాలి.