L2 ఎంపురాన్ సెన్సేషనల్ రికార్డు

L2 ఎంపురాన్ సెన్సేషనల్ రికార్డు

Published on Mar 29, 2025 1:01 AM IST

మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ చిత్రం L2 ఎంపురాన్ ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. గతంలో వచ్చిన లూసిఫర్ చిత్రానికి ఇది సీక్వెల్‌గా వచ్చింది. ఇక ఈ సినిమాను దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేశాడు. పూర్తి పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కింది.

ఈ సినిమా మార్చి 27న గ్రాండ్ రిలీజ్ కాగా, రిలీజ్ అయిన అన్ని చోట్లా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ దక్కుతోంది. ఈ సినిమా రిలీజ్ అయిన 48 గంటల్లో బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లతో సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసిందని చిత్ర యూనిట్ తాజాగా పేర్కొంది.

ఈ సినిమాలో టోవినో థామస్, మంజు వారియర్, పృథ్వీరాజ్ సుకుమారన్, అభిమన్యు సింగ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు