పెళ్లిలో ఉండే సంబురాన్ని, విందు, చిందులను కన్నుల విందుగా చూపెట్టే ప్రయత్నమే ‘లగ్గం’ మూవీ. ఈ సినిమాను రమేశ్ చెప్పాల డైరెక్ట్ చేస్తున్నారు. పూర్తి కల్చరల్ ఫ్యామిలీ డ్రామాగా రాబోతున్న ‘లగ్గం’ చిత్రాన్ని సుభిషి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్నారు.
ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తవగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమాకు సంబంధించిన ఆడియో రైట్స్ ను ప్రముఖ ఆడియో కంపెనీ ఆదిత్య మ్యూజిక్ దక్కించుకుంది. త్వరలోనే ఈ మూవీ ఆడియో సాంగ్స్ ను రిలీజ్ చేయనున్నారు. కాగా, జూన్ 21న ఫస్ట్ లిరికల్ సాంగ్ ను ప్రముఖ దర్శకుడు చేతుల మీదుగా విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. పెళ్లి నేపథ్యంలో సాగే ఈ పాట అందరినీ ఆకట్టుకుంటుందట.
ఈ సినిమా చూసి ప్రతిఒక్కరు దీని గురించి మాట్లాడుకుంటారని.. కొత్త ఎక్స్ పీరియన్స్ ను కళ్ల ముందు ఉంచే ఈ సినిమా కొన్ని తరాలు గుర్తుపెట్టుకుంటాయని ప్రముఖ నటులు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఇక ఈ సినిమాలో సాయి రోనక్, ప్రగ్యా నగ్రా, రాజేంద్రప్రసాద్, రోహిణి, సప్తగిరి, ఎల్బీ శ్రీరామ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.