మాస్ ట్రీట్ గా అదరగొడుతున్న ‘లైగర్’ కోకా 2.0 సాంగ్ …!

Published on Aug 12, 2022 5:25 pm IST

విజయ్ దేవరకొండ లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ లైగర్ పై అందరిలో భారీ అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో రమ్యకృష్ణ విజయ్ కి తల్లి పాత్ర చేస్తుండగా పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంస్థలు ఈ మూవీని ఎంతో భారీ స్థాయిలో నిర్మించాయి. ఇప్పటికే మన దేశంలోని పలు ముఖ్య ప్రాంతాల్లో ఫ్యాన్డం టూర్స్ ప్లాన్ చేసిన లైగర్ టీమ్, మూవీని మరింతగా ఫ్యాన్స్ కి ఆడియన్స్ కి చేరువ చేసేందుకు సిద్ధం అయింది.

యాక్షన్ తో కూడిన మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన లైగర్ నుండి ఇటీవల రిలీజ్ అయిన రెండు సాంగ్స్ ఆడియన్స్ ని ఆకట్టుకోగా నేడు కొద్దిసేపటి క్రితం ఈ మూవీ నుండి కోకా 2.0 అనే పల్లవితో సాగె సెలబ్రేషన్ వీడియో సాంగ్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేసారు. భాస్కరభట్ల రాసిన ఈ మాస్ బీట్ సాంగ్ ని రామ్ మిరియాల, గీత మాధురి ఎంతో అద్భుతంగా పాడగా, ఈ సాంగ్ విజువల్ గా అదిరిపోవడంతో అపాటు, విజయ్ దేవరకొండ వేసిన సిగ్నేచర్ స్టెప్స్ అయితే యూత్ ని మాస్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం ఈ సాంగ్ మంచి వ్యూస్ తో కొనసాగుతోంది. కాగా లైగర్ మూవీని ఆగష్టు 25న వరల్డ్ వైడ్ గ్రాండ్ లెవెల్లో పలు భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :