మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన రీసెంట్ మూవీ ‘లైలా’ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు రామ్ నారాయణ్ తెరకెక్కించగా, ఇందులో విశ్వక్ తొలిసారి ఓ లేడీ గెటప్‌లో నటించాడు. అయితే, ఈ సినిమా కథ ప్రేక్షకులు ఇంప్రెస్ చేయలేకపోయింది. ఫలితంగా ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్‌గా నిలిచింది.
ఇక ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో మార్చి 9 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, తాజాగా ఈ చిత్రం తమిళ భాషలోనూ స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం. ఓటీటీలోనూ ఈ చిత్రానికి నెగిటివ్ రెస్పాన్స్ దక్కింది. అయినా, కూడా మేకర్స్ ఈ చిత్రాన్ని ఇప్పుడు తమిళ్ డబ్బింగ్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు.
మరి ఈ తమిళ్ వెర్షన్ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి. ఇక ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటించగా అభిమన్యు సింగ్, పృథ్వీరాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సాహు గారపాటి ప్రొడ్యూస్ చేశారు.