విడుదల తేదీ: మార్చి 15, 2024
123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5
నటీనటులు: భరత్ రాజ్, దివి వడ్త్యా, వంశీ రాజ్, కిట్టయ్య, నిఖిల్ రాజ్, జనార్ధన్, అనురాధ, మాధవి, నవీన్‌రాజ్ శంకరపు, ప్రమోద్, రమణ, పరమేష్, సంధ్య
దర్శకుడు: నవీన్ గాంధీ
నిర్మాత: ఆనంద్ తన్నీరు
సంగీత దర్శకుడు: ఆర్ ఆర్ ధ్రువన్
సినిమాటోగ్రాఫర్: కె బుజ్జి
ఎడిటింగ్: కె విజయ్ వర్ధన్
సంబంధిత లింక్స్: ట్రైలర్
ఈ వారం థియేటర్స్ లోకి పలు చిన్న చిత్రాలు అయితే రిలీజ్ కి వచ్చాయి. మరి ఈ చిత్రాల్లో జై భరత్, దివి వడ్త్య హీరో హీరోయిన్స్ గా నటించిన చిత్రం “లంబసింగి (Lambasingi Telugu Movie Review)” కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ :
ఇక కథలోకి వస్తే.. వీరబాబు(భరత్ రాజ్) ఏపీలోని ఏజెన్సీ ప్రాంతం లంబసింగి పోలీస్ స్టేషన్ లో కొత్త కానిస్టేబుల్ గా జాయిన్ అవుతాడు. ఇక అదే ప్రాంతానికి చెందిన హరిత(దివి వడ్త్య) ని మొదటి చూపు లోనే ఇష్టపడతాడు. అలాగే మరోపక్క అక్కడ లోకల్ ఎమ్మెల్యేని నక్సలైట్ లు హతమార్చడం సమస్యగా మారుతుంది. మరి ఈ హత్యకి కారకులు ఎవరు? హరితకి ఆ నక్సలైట్స్ కి ఏమన్నా ఉందా? ఆమె వెనుక ఉన్న అసలు గతం ఏంటి? ఈ క్రమంలో వీరబాబు ఏం చేసాడు అనేది మిగతా కథ.
ప్లస్ పాయింట్స్ :
హీరోయిన్ గా డెబ్యూ ఇచ్చిన దివి ఈ చిత్రంలో మంచి పెర్ఫామెన్స్ ని కనబరిచింది అని చెప్పాలి. రీసెంట్ గా గాడ్ ఫాదర్ చిత్రంలోనే మంచి పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్న తాను ఫుల్ లెంగ్త్ లో ఈ చిత్రంలో తన డీసెంట్ లుక్స్ మరియు నాచురల్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటుంది.
ఇక నటుడు భరత్ రాజ్ కూడా తన డెబ్యూ లో డీసెంట్ పెర్ఫామెన్స్ ని కనబరిచాడు. కొన్ని ముఖ్య సన్నివేశాల్లో తన నటన బాగుంది. వీటితో పాటుగా సినిమాలో పాటలు కొంచెం ఇంప్రెసివ్ గా అనిపిస్తాయి.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమాలో మెయిన్ లీడ్ ఓకే పెర్ఫామెన్స్ లు తప్ప అసలు ఇంకా ఏ అంశం కూడా అంత ఆకట్టుకోదు. లైన్ పరంగా ఓకే కానీ దాని కథనం కూడా పరమ బోరింగ్ గా అనిపిస్తుంది. సినిమా చూస్తున్న కొద్దీ సన్నివేశాలు ఆడియెన్స్ కి ముందే అర్ధం అయ్యిపోతాయి ఆ రేంజ్ లో స్క్రీన్ ప్లే ఉంది.
ఇక దీనితో పాటుగా మరో ముఖ్యమైన మైనస్ జెనరల్ గా లంబసింగి అంటే చాలా మంచి బ్యూటిఫుల్ విజువల్స్ ని ఆశిస్తారు కానీ ఆశ్చర్యకరంగా ఇందులో అవేవి కనిపించవు. ఇంకా సినిమాలో ఓ చోట కథనం బాగుంది అనే లోపే తర్వాత మళ్ళీ బోర్ నరేషన్ తో దెబ్బ తీస్తుంది.
ఇంకా సినిమాలో లాజికల్ ఎర్రర్స్ కూడా బాగా ఉన్నాయి. సరైన డబ్బింగ్ కానీ లిప్ సింక్ కానీ కనిపించదు. వీటితో అసలు సినిమాలో నాచురటీ కనిపించదు. ఇంకా మెయిన్ లీడ్ మినహా మిగతా ఏ నటీనటుల పెర్ఫామెన్స్ లు కూడా అంత మెప్పించవు.
సాంకేతిక వర్గం :
సినిమాలో నిర్మాణ విలువలు పర్వాలేదు. కానీ టెక్నీకల్ టీం వర్క్ ఎఫర్ట్స్ ఆకట్టుకోవు. డబ్బింగ్ సరిగా లేదు. సంగీతంలో పాటలు ఓకే కానీ నేపథ్య సంగీతం ఫ్లాట్ గానే ఉంది. సినిమాటోగ్రఫీ కూడా ఇంకా మంచి విజువల్స్ ని చూపించాల్సింది. ఎడిటింగ్ పర్వాలేదు.
ఇక దర్శకుడు నవీన్ గాంధీ విషయానికి వస్తే.. తాను ఎంచుకున్న లైన్ ఓకే కానీ దానిని ఆసక్తిగా మలచడంలో ఫెయిల్ అయ్యాడు. మెయిన్ గా మంచి స్క్రీన్ ప్లే మిస్ అయ్యింది. వీటితో తన వర్క్ ఏమి అంత మెప్పించలేదు.
తీర్పు :
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “లంబసింగి (Lambasingi)” చిత్రంలో దివి, భరత్ రాజ్ లు తమ పాత్రలకి న్యాయం చేశారు కానీ సినిమాలో విషయం తేలిపోయింది. బోరింగ్ కథనం పేలవమైన సన్నివేశాలు నీరసం తెప్పిస్తాయి. వీటితో ఈ వారాంతానికి ఈ సినిమాని టచ్ చేయకపోవడమే మంచిది.
123telugu.com Rating: 1.5/5
Reviewed by 123telugu Team