చక్రి చివరి మాటలు ఇవే..

చక్రి చివరి మాటలు ఇవే..

Published on Dec 15, 2014 4:34 PM IST

chakri2

‘ఎందుకో జగన్ అన్నయ్యను ఇప్పుడు చూడాలని ఉంది రా..’ సంగీత దర్శకుడు చక్రి మాట్లాడిన చివరి మాటలు ఇవే. ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంటకు కృష్ణా నగర్ లో గల రికార్డింగ్ స్టూడియోలో వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటికి వెళ్తూ ఆఫీసు బాయ్, చక్రి మధ్య జరిగిన సంభాషణ ఇది. దర్శకుడు పూరి జగన్నాధ్ అంటే చక్రికి ఎంత ప్రేమో ఈ వ్యాఖ్యల ద్వారా మనకు అర్ధమవుతుంది. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించారు పూరి జగన్నాధ్.

‘బాచి’ సినిమాతో చక్రిని సంగీత దర్శకుడిగా పూరి జగన్నాధ్ చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. ఆ తర్వాత వీరిద్దరి కలయికలో వరుసగా ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’, ‘ఇడియట్’. ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’, ‘శివమణి’, ‘143’, ‘నేనింతే’, ‘గోలీమార్’ వంటి మ్యూజికల్ హిట్ సినిమాలు వచ్చాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో పూరి జగన్నాధ్, చక్రిలది ప్రత్యేక అనుబంధం. ఒకేసారి కెరీర్ మొదలుపెట్టి అగ్ర స్థానాలకు చేరుకున్నారు. చక్రి మృతి పట్ల పూరి జగన్నాధ్ సంతాపాన్ని తెలియజేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు