మరణించిన సంగీత దర్శకుడి తల్లికి కరోనా.!

Published on Jun 2, 2020 10:15 pm IST

బాలీవుడ్ సంగీత దర్శకుడు వాజీద్‌ ఖాన్‌ తల్లి రజినాకు కరోనా వైరస్ సోకినట్లు వైద్యులు తెలిపారు. కాగా కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతున్న వాజీద్ ఇటీవల ఆసుపత్రిలో చేరగా, అతడి సంరక్షణ కోసం ఆమె అక్కడే ఉన్నారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన కరోనా బాధితుల నుంచి రజినాకు.. ఆ తరువాత ఆమె నుంచి వాజీద్‌కి వైరస్ సోకిందేమోనని వైద్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం రజినా పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. వాజిద్ ఖాన్ గత సోమవారం మరణించిన సంగతి తెలిసిందే. వాజిద్ ఖాన్ బాలీవుడ్ లో అనేక ప్రముఖ హీరోల సినిమాలకు మ్యూజిక్ అందించారు. మరో మ్యూజిక్ కంపోజర్ సాజిద్ తో కలిసి ఆయన అనేక సినిమాలకు పని చేశారు. సల్మాన్ సూపర్ హిట్ సిరీస్ దబంగ్ మూడు పార్టులకు సంగీతం వాజిద్ అందించారు. అలాగే సల్మాన్ నటించిన వాంటెడ్, ఏక్తా టైగర్ చిత్రాలకు కూడా ఆయన సంగీతం అందించడం జరిగింది.

సంబంధిత సమాచారం :

More