లేటెస్ట్..”ఆదిపురుష్” నుంచి రామనవమి వెరీ స్పెషల్ పోస్టర్స్.!

Published on Mar 30, 2023 7:20 am IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ పాలన్ ఇండియా సినిమా “ఆదిపురుష్” కోసం అందరికీ తెలిసిందే. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన ఈ మాసివ్ విజువల్స్ సినిమా రామాయణం ఆధారంగా తెరకెక్కగా ప్రభాస్ శ్రీరామునిగా కృతి సనన్ అయితే జానకి దేవి పాత్రలో నటించింది. మరి మొదటి నుంచి ఎన్నో అంచనాలు ఉన్న ఈ సినిమాని అయితే ఏ చిన్న లీక్ కూడా బయటకి రాకుండా జాగ్రత్త తీసుకున్న మేకర్స్ టీజర్ తో ఏదో ప్లాన్ చేస్తే ఇంకేదో అయ్యింది.

ఇక దీనితో మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేసి కొత్త రిలీజ్ డేట్ ని లాక్ చేశారు. అక్కడ నుంచి మళ్ళీ ఏ అప్డేట్ కూడా లేదు దీనితో ఇక ఈ రామనవమికి మాత్రమే అభిమానులు ఆశలు పెట్టుకోగా ఫైనల్ గా ఈ పర్వదినాన అయితే మేకర్స్ అవైటెడ్ అప్డేట్ రివీల్ చేశారు. పండుగ కానుకగా స్పెషల్ పోస్టర్స్ ని రిలీజ్ చేశారు. మరి ఇవి మాత్రం చాలా ఆసక్తి గొలిపేలా ఉన్నాయని చెప్పాలి.

రావణ సంహారం తర్వాత రాముడు సీత లక్ష్మణుడు అలాగే ఆంజనేయుని కలయికలో ప్రత్యేక పటాన్ని మనం చూస్తూనే ఉంటాము ఆ తరహాలో ఈ రామనవమికి చిత్ర యూనిట్ డిజైన్ చేసిన పోస్టర్ పర్ఫెక్ట్ గా ఉందని చెప్పాలి. అలాగే ఆదిపురుష్ టైటిల్ ఫాన్ట్ ని కూడా మేకర్స్ అప్డేట్ చేయడం విశేషం. దీనితో పోస్టర్స్ డెఫినెట్ గా ఫ్యాన్స్ సహా అందరిని ఆకట్టుకునేలా ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు.

సంబంధిత సమాచారం :